News April 11, 2025

తిరుపతి ప్రజలకు గమనిక 

image

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ఇంటి పన్నులు, ఖాళీ జాగా పన్నులను చెల్లిస్తే 50 శాతం వడ్డీ మినహాయింపు ఈ నెలాఖరు వరకు పొడిగించినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య శుక్రవారం తెలిపారు. 2024-25 సంవత్సరంలో పెండింగ్ ఉన్న బకాయిలు ఏప్రిల్ 30వ తేదీలోపు ఒకేసారి చెల్లిస్తే  ప్రస్తుతమున్న వడ్డీపై 50 శాతం రాయితీ ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని బకాయిదారులు వినియోగించుకోవాలని కోరారు.

Similar News

News April 25, 2025

NRML: ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని యువతి సూసైడ్

image

ప్రేమించిన యువకుడితో పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ యువతి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇన్‌ఛార్జ్ ఎస్సై శ్రావణి  కథనం ప్రకారం.. ఖానాపూర్‌ మండలం కొలాంగూడకు చెందిన ఆత్రం స్వప్న(18) గ్రామానికి చెందిన ఒక అబ్బాయిని ప్రేమించింది. యువతి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో పత్తి చేనులో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది.

News April 25, 2025

KMR: ప్రియుడితో కలిసి భర్తను చంపింది

image

రామారెడ్డి PSలో ఏడాది క్రితం మిస్సైన కేసును పోలీసులు చేధించారు. ASP చైతన్యరెడ్డి వివరాలిలా.. ఇస్సన్నపల్లి వాసి తిరుపతి భార్య మనెవ్వకు లింబయ్యతో అక్రమ సంబంధం ఏర్పడిందని తేలింది. తిరుపతి అడ్డుగా ఉన్నాడని లింబయ్య మరో ఇద్దరితో కలిసి తిరుపతిని మందు తాగుదాం అని చెప్పి డొంకల్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అనంతరం హత్య చేసి పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగలబెట్టారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు.

News April 25, 2025

VKB: బాల్య వివాహాల నిర్మూలనకు చర్యలు: అదనపు కలెక్టర్

image

బాల్య వివాహాల నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ తెలిపారు. గురువారం వికారాబాద్ కలెక్టరేట్లో బాల్య వివాహల నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖలతో అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహలను నిర్మూలించేలా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగాలని అదనపు కలెక్టర్ సూచించారు.

error: Content is protected !!