News April 2, 2025
తిరుపతి: ప్రతి జిల్లాలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రం

కేంద్ర ప్రభుత్వ నూతన మార్గదర్శకాల ప్రకారం ప్రతి జిల్లాలో డ్రైవింగ్ శిక్షణ సంస్థ నెలకొల్పేందుకు అనుమతులు ఇస్తున్నామని తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ తెలిపారు. తిరుపతిలోని ఆర్టీవో కార్యాలయంలో లైట్ మోటార్ వాహనాలు, హెవీ మోటర్ వాహనాల డ్రైవింగ్ స్కూల్ యాజమాన్యాలతో ఆయన సమావేశం నిర్వహించారు. తిరుపతిలో లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఈ శిక్షణ సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు.
Similar News
News April 4, 2025
విద్యార్థులకు మెరుగైన విద్య అందించండి: ITDA PO

ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని ఐటీడీఏ పీఓ కుష్బూగుప్తా ఉపాధ్యాయులను ఆదేశించారు. శుక్రవారం ఇంద్రవెల్లి బాలికల ఏకలవ్య మోడల్ రెసిడెన్సీ పాఠశాలను పీఓ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న విద్య, వైద్యం, భోజనంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన విద్యతో పాటు ప్రతిరోజూ మెనూ ప్రకారం పోషక విలువలున్న ఆహారాన్ని అందించాలని సూచించారు.
News April 4, 2025
38 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్ల ప్రకటన

AP: రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల పంపకం కొనసాగుతోంది. ఇటీవల 47 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను ప్రకటించగా, ఇవాళ మరో 38 కమిటీలకు ప్రభుత్వం నియామకాలు చేసింది. ఇందులో 31 టీడీపీకి, 6 జనసేనకు, ఒకటి బీజేపీకి దక్కింది. త్వరలోనే మిగతా కమిటీలకు ఛైర్మన్లను ప్రకటిస్తామని టీడీపీ వెల్లడించింది. కాగా రాష్ట్రవ్యాప్తంగా 218 మార్కెట్ కమిటీలున్నాయి.
News April 4, 2025
ADB: శభాష్.. AIతో చక్కగా చదువు చెబుతున్నారు: DEO

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉపయోగించి కంప్యూటర్ ద్వారా విద్యా బోధన చేస్తున్న ఆదిలాబాద్లోని రణదివ్యనగర్ ప్రభుత్వ పాఠశాలలను డీఈవో శ్రీనివాస్రెడ్డి శుక్రవారం సందర్శించారు. ఉపాధ్యాయుల బోధన తీరును పరిశీలించారు. విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించి హర్షం వ్యక్తం చేసి ఉపాధ్యాయులను అభినందించారు. అకడమిక్ కోఆర్డినేటర్ శ్రీకాంత్ గౌడ్, సీసీ రాజేశ్వర్ తదితరులున్నారు.