News October 30, 2024

తిరుపతి: ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

తిరుపతిలోని జాతీయ సంస్కృత యూనివర్సిటీ (NSU)లో 2024-25 విద్యా సంవత్సరానికి విద్యా వారధి హెచ్‌డీ(Ph.D)లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. అర్హత, ఇతర వివరాలకు https://nsktu.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 01.

Similar News

News October 30, 2024

SVBCకి రూ.55 లక్షల విరాళం

image

టీటీడీ ఎస్వీబీసీ ట్రస్ట్‌కు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ విరాళం ఇచ్చింది. ఆ బ్యాంకు ఎండీ మనీ మేఘలై, జోనల్ హెడ్ ఛైర్మన్ సీవీఎన్ భాస్కరరావు, రీజినల్ హెడ్ గాలి రాంప్రసాద్ రూ.55 లక్షల చెక్కును తిరుమలలో అదనపు ఈవో వెంకయ్య చౌదరికి మంగళవారం మధ్యాహ్నం అందజేశారు.

News October 30, 2024

9 నుంచి యూరప్‌లో శ్రీనివాస కళ్యాణాలు

image

టీటీడీ ఆధ్వర్యంలో ఈ ఏడాది నవంబర్, డిసెంబర్‌లో యూకే, ఐర్లాండ్, యూరప్‌లోని 8 దేశాల్లోని 13 నగరాల్లో శ్రీనివాస కళ్యాణాలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమ నిర్వాహకులు సూర్య ప్రకాశ్, కృష్ణ జవాజీ తదితరులు టీటీడీ ఈవో శ్యామలరావును తిరుపతిలోని అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌లో మంగళవారం కలిశారు. శ్రీనివాస కళ్యాణాల్లో పాల్గొనాలని ఈవోను ఆహ్వానించారు.

News October 29, 2024

చిత్తూరు జిల్లాలో ఖరీఫ్ కరవు మండలాలు ఇవే

image

➤తంబళ్లపల్లె ➤గుర్రంకొండ ➤బి.కొత్తకోట
➤కలకడ ➤పీలేరు ➤కలికిరి
➤వాయల్పాడు ➤కురబలకోట ➤పీటీఎం
➤మదనపల్లె ➤నిమ్మనపల్లె ➤పెనుమూరు
➤యాదమరి ➤గుడిపాల
☞శ్రీరంగరాజపురం ☞చిత్తూరు ☞సోమల
☞శాంతిపురం ☞రొంపిచెర్ల ☞పూతలపట్టు
☞పుంగనూరు ☞పలమనేరు
☞బైరెడ్డిపల్లె ☞వి.కోట ☞గుడుపల్లె
☞కుప్పం ☞రామకుప్పం
➤(తీవ్రమైన కరవు) ☞(మధ్యస్త కరవు) అని ప్రభుత్వం ప్రకటించింది.