News February 23, 2025

తిరుపతి: ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 పరీక్షలు

image

ఎపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ డా.వెంకటేశ్వర్ ఎస్ తెలిపారు. ఆదివారం ఉదయం10 నుంచి 12.30 గంటల వరకు మధ్యాహ్నం 3.00 నుంచి 5:30 గంటల వరకు రెండు సెషన్లలో ఎపీపీస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష నిర్వహణ జరిగిందన్నారు. ఈ పరీక్షల్లో 5055 మంది పరీక్షలకు హాజరైనట్లు ఆయన తెలిపారు. ఎందుకు 13 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News September 18, 2025

VKB: దత్త పీఠాన్ని దర్శించుకున్న స్పీకర్

image

దత్తాత్రేయుడి కటాక్షంతో ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆకాంక్షించారు. గురువారం దుండిగల్‌లోని దత్త పీఠాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక, దైవచింతన అలవర్చుకుంటే చక్కటి జీవితం సాధ్యపడుతుందని పేర్కొన్నారు.

News September 18, 2025

ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళికలు సిద్ధం చేయాలి: కలెక్టర్

image

వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు పటిష్ఠ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ డా.సత్య శారద ఆదేశించారు. 2025-26లో 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా 260 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. రైతులు నాణ్యత ప్రమాణాలతో ధాన్యం తెచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సన్న, దొడ్డు రకాలను వేరువేరుగా నిలువ చేయాలన్నారు.

News September 18, 2025

వేగూరులో పిడుగుపాటుకు వ్యక్తి మృతి

image

కోవూరు మండలం వేగూరు పంచాయతీలో పిడుగుపాటుకు గోళ్ల వెంకయ్య మృతి చెందారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని కోవూరు ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. కోవూరు ఎస్సై రంగనాథ్ గౌడ్ మృతదేహాన్ని పరిశీలించారు.