News March 22, 2024

తిరుపతి: ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకం: కలెక్టర్

image

ప్రిసైడింగ్ అధికారుల హ్యాండ్ బుక్ చదివి పూర్తి అవగాహన కలిగి పక్కాగా ఎన్నికల నిర్వహణ చేయాలని కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు.  కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ సారి ఎన్నికలలో పలు కొత్త అంశాలు, సూచనలు ఉన్నాయని, పూర్తిగా పీ.ఓ హ్యాండ్ బుక్ చదివి అవగాహన కలిగి ఉండాలని, అప్పుడు ఎన్నికల నిర్వహణ సులువు అవుతుందని అన్నారు.

Similar News

News October 24, 2025

పౌల్ట్రీ రంగ రైతులతో కలెక్టర్ సమీక్ష

image

కలెక్టర్ సుమిత్ కుమార్ కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లాలోని పౌల్ట్రీ రంగం రైతులు, కంపెనీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. పౌల్ట్రీ రంగ అభివృద్ధికి రైతులు, కంపెనీలు సమన్వయంతో కృషి చేయాలని కోరారు. రైతులకు ప్రభుత్వం తరఫున సౌకర్యాలు, రాయితీలు కల్పిస్తామని వివరించారు. రైతులకు కంపెనీలు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. రాయితీల సక్రమంగా అందించేందుకు ప్రత్యేక టీములు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

News October 24, 2025

చిత్తూరు జిల్లాలో 177 ఎకరాలలో దెబ్బతిన్న వరి పంట

image

వర్షాల కారణంగా జిల్లాలో 177 ఎకరాల్లోని వరి పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖాధికారులు తెలిపారు. 12 మండలాల పరిధిలోని 32 గ్రామాల్లో 172 మంది రైతులు సాగు చేసిన వరి పంట దెబ్బతిన్నట్లు గుర్తించారు. అత్యధికంగా పెనుమూరు మండలంలో 70 ఎకరాల్లో పైరు దెబ్బతినగా, చౌడేపల్లె మండలంలోని ఒకే గ్రామంలో 40 ఎకరాలు, యాదమరి మండలంలోని ఐదు గ్రామాల్లో 12.25 ఎకరాలు సాగు చేసిన వరి పైరు దెబ్బతింది.

News October 24, 2025

చిత్తూరు జిల్లాలో వర్షపాత వివరాలు

image

చిత్తూరు జిల్లాలో గడిచిన 24 గంటల్లో బంగారుపాళ్యం మినహా 31 మండలాల్లో తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా నిండ్రలో 83.4 మిమీ, అత్యల్పంగా పెద్దపంజాణిలో 2.6 మిమీ వర్షపాతం నమోదయ్యింది. మండలాల వారీగా కుప్పంలో 35.2, విజయపురంలో 34.4, నగరిలో 28.8, శ్రీరంగరాజపురంలో 26.8, పాలసముద్రంలో 26.6, గుడుపల్లెలో 23.6, సోమలలో 14.6 మీ. మీ వర్షపాతం నమోదు అయింది.