News February 14, 2025

తిరుపతి: ప్రేమికుల రోజే.. యువతి నోట్లో యాసిడ్ పోసి అఘాయిత్యం?

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. గుర్రంకొండ మండలంలో శుక్రవారం ఉదయం యువతిపై అఘాయిత్యం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిని ఇద్దరు వ్యక్తులు నిర్భంధించి దాడి చేశారు. ఆమెను కత్తులతో పొడిచి, నోట్లో యాసిడ్ పోసి అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 108లో బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 23, 2026

రోల్డ్‌గోల్డ్ నగలు ఎక్కువకాలం మన్నాలంటే..

image

నగలంటే ప్రతి మహిళకూ ప్రత్యేకమే. కానీ రోజురోజుకూ పెరిగిపోతున్న బంగారం ధరలతో నగలు కొనడం కష్టమవుతోంది. దీంతో గిల్టు నగలు కొనడం ఎక్కువైంది. అయితే వీటిని సరిగ్గా సంరక్షించకపోతే త్వరగా పాడైపోతాయి. అందుకే వీటిని నీటికి దూరంగా ఉంచాలి. చర్మంపై మేకప్, మాయిశ్చరైజర్, పర్ఫ్యూమ్‌లు, లోషన్లు, డియోడరెంట్లు వాడే ముందు గిల్టు నగలను తీసేయాలి. వీటి కెమికల్స్ వల్ల వాటి కోటింగ్ పోతుంది. ఎయిర్‌టైట్ పౌచ్‌లో భద్రపరచాలి.

News February 23, 2026

38 ఫిర్యాదులు స్వీకరించిన ఆదిలాబాద్ SP

image

బాధితుల పట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం అండగా ఉంటుందని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోమవారం పోలీసు ముఖ్య కార్యాలయంలో గ్రీవెన్స్ డే సందర్భంగా ప్రజా ఫిర్యాదులను నేరుగా స్వీకరించారు. వెంటనే స్పందించిన ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు ఇచ్చి సత్వరమే పరిష్కరించాలని సూచించారు. జిల్లా నలుమూలల నుంచి దాదాపు 38 ఫిర్యాదుదారులు తమ సమస్యలను ఎస్పీకి తెలియజేశారు.

News February 23, 2026

అభిషేక్‌కు కొన్ని మ్యాచులు బ్రేక్ ఇవ్వాలి: కైఫ్

image

T20WCలో విఫలమవుతున్న ఓపెనర్ అభిషేక్ శర్మకు కొన్ని మ్యాచులు బ్రేక్ ఇవ్వాలని భారత మాజీ క్రికెటర్ కైఫ్ అభిప్రాయపడ్డారు. ‘ఇదేం బైలాటరల్ సిరీస్ కాదు. వరల్డ్ కప్‌లో ప్రతి మ్యాచ్ కీలకం. ప్రస్తుతం అభిషేక్ ఫామ్ కోల్పోయారు. నాలుగు మ్యాచులు అవకాశాలు ఇచ్చినా ఫెయిలయ్యారు. ఇలాగే కంటిన్యూ చేయకుండా అతనికి బ్రేక్ ఇవ్వాలి. ఆ స్థానంలో సీనియర్ ప్లేయర్ సంజూను ఆడించాలి’ అని సూచించారు.