News March 21, 2025
తిరుపతి: ప్రైవేట్ స్కూళ్లపై ఫిర్యాదు

తిరుపతి జిల్లాలోని కొన్ని ప్రైవేట్ స్కూల్లో ఒంటిపూట బడులు నిర్వహించడం లేదని అఖిలపక్ష విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ఈ మేరకు డీఈవో కేవీఎన్ కుమార్ శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఒంటిపూట బడులు పెట్టని స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీ స్టూడెంట్స్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హేమాద్రి యాదవ్, ప్రేమ్ కుమార్, లోకేశ్, యుగంధర్, ముని, సుకుమార్ పాల్గొన్నారు.
Similar News
News September 17, 2025
బొబ్బిలి ప్రభుత్వ ఐటీఐలో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

బొబ్బిలి ప్రభుత్వ ఐటీఐలో ఖాళీ సీట్లు భర్తీకి దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ బలగ పోతయ్య తెలిపారు. ఈనెల 27లోగా iti.ap.gov.in వెబ్సైట్లో టెన్త్, స్టడీ సర్టిఫికేట్స్, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రాలతో ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారు 28న సర్టిఫికేట్స్ వేరిఫికేషన్కు ఒరిజినల్ సర్టిఫికేట్స్, అన్ని పత్రాలతో రావాలన్నారు. >Share it
News September 17, 2025
పాకిస్థాన్తో మ్యాచ్.. యూఏఈ బౌలింగ్

ఆసియాకప్లో పాకిస్థాన్ ఆడటంపై ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. యూఏఈతో మ్యాచులో టాస్ కోసం ఆ జట్టు కెప్టెన్ సల్మాన్ మైదానంలోకి వచ్చారు. టాస్ గెలిచిన యూఏఈ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో గెలిచిన జట్టు సూపర్-4 చేరనుంది.
News September 17, 2025
నాయకులారా చూడండి.. ఇదీ ఆదిలాబాద్లో పరిస్థితి..!

నిజాం పాలన నుంచి విముక్తి పొందిన రోజంటూ అన్ని పార్టీల నాయకులు, అధికారులు గొప్పగా ఉత్సవాలు చేసుకున్నారు. కానీ ప్రజా సమస్యలు మాత్రం ఎక్కడి వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నాయన్న దానికి ఈ ఘటనే నిదర్శనం. ఉట్నూర్(M) సుంగు మత్తడిగూడ వాసి కుమ్ర పారుబాయి(45) అనారోగ్యంతో చనిపోయింది. ఆ ఊరిలో బ్రిడ్జి లేక వాగులో ఒకరినొకరు పట్టుకుని ఈరోజు ఆమె మృతదేహాన్ని అంత్యక్రియలకు తీసుకెళ్లిన ఘటన కంటతడి పెట్టిస్తోంది.