News May 3, 2024
తిరుపతి: బస్సు ఢీకొని ముగ్గురి మృతి

తిరుపతి జిల్లాలో నిన్న ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏర్పేడు సీఐ శ్రీరామ శ్రీనివాస్ వివరాల మేరకు.. ముంబయికి చెందిన లలిత్ కుమార్ సింఘాల్(57) చెన్నైలో పని చేస్తున్నారు. తన భార్య అంజూ శింఘాల్తో కలిసి కారులో శ్రీకాళహస్తి వైపుకు వస్తుండగా మేర్లపాక వద్ద తమిళనాడు ఆర్టీసీ బస్సు ఢీకొంది. కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా భార్యాభర్తలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.
Similar News
News November 24, 2025
చిత్తూరు: ప్రియురాలిని చంపిన ప్రియుడు.. పరార్.!

ప్రియుడి చేతిలో ప్రియురాలు దారుణ హత్యకు గురైన ఘటన ఇది. స్థానికుల వివరాల మేరకు.. రామసముద్రం(M) బిక్కింవారిపల్లెకు చెందిన దేవిశ్రీ(22) బెంగళూరులో BBA చదువుతోంది. అక్కడ చౌడేపల్లి(M) పెద్దకొండామరికి చెందిన గోవర్ధన్ పరిచయం అయ్యాడు. పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే ఆదివారం రాత్రి ఆమెను గోవర్ధన్ హత్య చేసి పరారైనట్లు బెంగళూరు తమ్మినహళ్లి PSలో కేసు నమోదు అయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 24, 2025
చిత్తూరు: ఇటుకల ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మృతి

కార్వేటినగరం(M) సురేంద్రనగరం కనుమ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కార్వేటినగరం నుంచి పుత్తూరు వైపు ఇటుకల లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ట్రాక్టర్ డ్రైవర్, లోడ్పై కూర్చుని ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందారు. మరో మహిళ కనుమ కాలువలో పడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 24, 2025
చిత్తూరు జిల్లాలో నేటి టమాటా ధరలు

టమాటా ధరల పెరుగుదలతో రైతుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సోమవారం ధరలు ఇలా ఉన్నాయి. నాణ్యత కలిగిన టమాటా ధరలు మొదటి రకం 10 కిలోలు ములకలచెరువు- రూ.510, పుంగనూరు-రూ.100, పలమనేరు- రూ.480, వీకోట-రూ.500 వరకు ధర పలుకుతోంది. వర్షాల కారణంగా పంట తగ్గిపోవడంతోనే ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.


