News March 26, 2025
తిరుపతి: బాత్రూంలో జారిపడ్డ మాజీ మంత్రి పెద్దిరెడ్డి ?

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన ఇంటిలోని బాత్రూంలో జారిపడి కుడి చేయికి దెబ్బ తగిలినట్లు సమాచారం. తిరుపతి-రేణిగుంట మార్గంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పెద్దిరెడ్డికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కుడి చేయికి ఆపరేషన్ జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 30, 2025
మల్దకల్: 2025-26 ఆలయ వేలంపాట ఎంత అంటే..!

ఆదిశేలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 2025-26 సంవత్సరానికి సంబంధించిన టెంకాయల వేలం, తలనీలాల వేలం బుధవారం జరిగింది. ఇందులో టెంకాయల వేలాన్ని మల్దకల్‌కు చెందిన ఉప్పరి నరసింహులు రూ. 22,59,000 లకు దక్కించుకోగా,అలాగే, బ్రహ్మోత్సవాల సందర్భంగా తలనీలాల వేలాన్ని మహబూబ్‌నగర్‌కు చెందిన రామన్ గౌడ్ రూ. 3,17,499 దక్కించుకున్నారని ఈవో సత్య చంద్రారెడ్డి తెలిపారు.
News October 30, 2025
పంట వివరాలను 5రోజుల్లో నివేదిక ఇవ్వాలి: జేసీ

మొంథా తుఫాన్ కారణంగా జిల్లాలో నీట మునిగిన పంటల వివరాలను ఐదు రోజుల్లో సేకరించి నివేదిక సమర్పించాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. బుధవారం ఆయన కార్యాలయం నుంచి మొంథా తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాల వలన నీట మునిగిన పంటల వివరాలను తెలుసుకునేందుకు సంబంధిత శాఖల అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్. వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
News October 30, 2025
బాలింతల ఆహారంలో ఇవి ఉన్నాయా?

గర్భం దాల్చినప్పటి బిడ్డకు రెండేళ్లు ముగిసేవరకు మహిళలకు అదనపు పోషకాలు అందించాలంటున్నారు నిపుణులు. ఇవే బిడ్డ శారీరక, మానసిక పెరుగుదలకు తోడ్పడుతుంది. అందుకే బాలింతలు మొదటి 6నెలలు రోజువారీ ఆహారంలో 600 క్యాలరీలు, 13.6 గ్రా ప్రొటీన్ ఉండేలా చూసుకోవాలంటున్నారు. 6-12 నెలల మధ్యలో 520 క్యాలరీలు, 10.6గ్రా ప్రొటీన్ తీసుకోవాలి. వీటితో పాటు ప్రతిరోజూ 290mg అయోడిన్, 550mg కోలిన్ తీసుకోవాలంటున్నారు.


