News August 31, 2024
తిరుపతి: ‘బాధితులకు న్యాయం చేయాలి’

నేర సంఘటనలపై కేసు నమోదు చేసినంతనే సరిపోదని.. బాధితులకు న్యాయం చేయాలని తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు సూచించారు. స్థానిక మహిళా యూనివర్సిటీ సెమినార్ హాలులో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. న్యాయం కోసం ప్రజలు ఏ సమయంలో వచ్చి ఫిర్యాదు చేసినా స్వీకరించి, సమగ్రంగా విచారణ చేయాలని చెప్పారు. నేరాలపై అలసత్వం పనికిరాదన్నారు. సమాచారం అందిన వెంటనే నేర స్థలాన్ని పరిశీలించాలన్నారు.
Similar News
News February 11, 2025
నగరి ఎమ్మెల్యే సోదరుడు వైసీపీలో చేరికకు బ్రేక్!

టీడీపీ నేత, నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ సోదరుడు గాలి జగదీశ్ వైసీపీలో చేరికకు తాత్కాలిక బ్రేక్ పడింది. రేపు వైసీపీలో చేరేందుకు మాజీ సీఎం జగన్‌తో వైసీపీ కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు. గాలి జగదీశ్ చేరికకు మాజీ మంత్రి రోజా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఆయన చేరికను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో జగదీశ్ నగరి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
News February 11, 2025
158 ఏళ్ల చరిత్ర కలిగిన మసెమ్మ జాతర రేపే ప్రారంభం

పుంగనూరు(M) కొండచర్లకురప్పల్లె మసెమ్మ జాతరకు గ్రామస్థులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ జాతర ఈనెల12,13వ తేదీల్లో జరగనుంది. మసెమ్మ జాతరకు సుమారు 158 సంవత్సరాల చరిత్ర ఉంది. కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా కొలువై ఉండడంతో జిల్లా వాసులే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.
News February 10, 2025
చిత్తూరు సమీపంలో బాంబ్ బ్లాస్ట్.. ఒకరు మృతి

చిత్తూరు సమీపంలో బాంబ్ పేలి ఒకరు చనిపోయారు. ఉయ్యాల చింత వద్ద రోడ్డు పనుల్లో భాగంగా బాంబ్ బ్లాస్టింగ్ చేస్తున్నారు. ఈక్రమంలో ఒక్కసారిగా బాంబ్ పేలింది. అక్కడే పనిచేస్తున్న అంజు స్పాట్‌లోనే చనిపోయారు. యాదగిరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.