News April 24, 2025
తిరుపతి: బాలికపై అత్యాచారం

తిరుపతిలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు CI మురళీ మోహన్ తెలిపారు. చెర్లోపల్లికి చెందిన రవి కుమార్, సాయి స్నేహితులు. వారికి తిరుపతికి చెందిన 16 ఏళ్ల బాలికతో పరిచయం ఉంది. ఆమె సాయితో వెళ్లిపోయింది. చెర్లోపల్లి వద్ద నిందితులు మరో వ్యక్తితో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు CI వెల్లడించారు.
Similar News
News April 24, 2025
కేజీబీవీ విద్యార్థినులకు డీఈవో సన్మానం

ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో మంచి మార్కులు సాధించిన జిల్లాలోని 6 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో జూనియర్ కళాశాలల విద్యార్థినిలను జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈవో రమేష్ కుమార్ శాలువాతో సన్మానించి అభినందించారు. విద్యార్థులకు ఉన్నత చదువులపై పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. భవిష్యత్‌లో మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జీసీడీవో శోభారాణి, తదితరులు ఉన్నారు.
News April 24, 2025
టెన్త్ రిజల్ట్స్.. కవలలకు ఒకే మార్కులు

AP: పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన కవలలు టెన్త్ ఫలితాల్లో సాధించిన మార్కులు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. బలిజిపేట (M) వంతరాం గ్రామానికి చెందిన బెవర శ్రవణ్, బెవర సింధు కవలలు. స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో టెన్త్ చదివారు. నిన్న విడుదలైన ఫలితాల్లో ఇద్దరికీ 582 చొప్పున మార్కులు రాగా, స్థానికంగా ఈ విషయం ఆసక్తి రేపింది. మంచి మార్కులు సాధించినందుకు వీరి తల్లిదండ్రులు ఉమా, రాము సంతోషపడ్డారు.
News April 24, 2025
ఫిట్జీ కోచింగ్ సెంటర్లపై ఈడీ దాడులు

ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌లోని ఫిట్జీ కోచింగ్ సెంటర్లపై ఈడీ దాడులు చేపట్టింది. ఏకకాలంలో మొత్తం 8 చోట్ల సోదాలు నిర్వహించింది. ఆర్థిక నేరాలకు పాల్పడినందుకు PMLA కింద కేసు నమోదు చేసింది. ఫిట్జీ తమకు సంబంధించిన కొన్ని కేంద్రాలను అకస్మాత్తుగా మూసివేయడం ద్వారా రూ.11.11 కోట్లు అక్రమంగా ఆర్జించినట్లు ఆరోపణలు రావడంతో ఈ దాడులు చేపట్టింది. మనీ లాండరింగ్‌కు కూడా పాల్పడినట్లు ఈడీ అనుమానిస్తోంది.