News February 13, 2026

తిరుపతి: మహిళలకు ఆ బస్సుల్లోనూ ఫ్రీ

image

మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు సత్యవేడు నుంచి ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు APSRTC సత్యవేడు డిపో మేనేజర్ వెంకటరమణ తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 14వ తేదీ సదాశివకోనకు 3 ప్రత్యేక బస్సులు, అవంతికోనకు 1 బస్సు నడపనున్నట్లు తెలిపారు. 15వ తేదీ 10 ప్రత్యేక బస్సులు సదాశివకోనకు, అవంతి కోనకు 3 బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రత్యేక బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చన్నారు.

Similar News

News March 6, 2026

చౌటుప్పల్: బైక్ దొంగల అరెస్ట్.. ముగ్గురు రిమాండ్‌కు

image

చౌటుప్పల్ మండలంలో జరిగిన రెండు వేర్వేరు బైక్ చోరీ కేసుల్లో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ మన్మధ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. వైన్ షాప్ ముందున్న స్ప్లెండర్, ఇంటి ముందు పార్క్ చేసిన ఆక్టివా ఎలక్ట్రిక్ బైక్‌లను దొంగిలించిన నిందితులు బతుల మణి, తమ్మిశెట్టి పెద్దిరాజు, కందగట్ల కిరణ్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు.

News March 6, 2026

చెన్నూరు: ఉపాధ్యాయుడిగా మారిన జిల్లా కలెక్టర్

image

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. చెన్నూరు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి 9వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించి వారి అభ్యాసన సామర్ధ్యాలను పరిశీలించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. నేను ప్రకారం విద్యార్థులకు సకాలంలో పోస్ట్కాహారం అందించాలని అధికారులను ఆదేశించారు.

News March 6, 2026

దీదీకి కొత్త తలనొప్పి?

image

ఎన్నికల వేళ బెంగాల్ గవర్నర్‌గా ఆర్ఎన్ <<19306866>>రవి<<>> రావడంపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. 2021లో తమిళనాడుకు గవర్నర్‌గా వచ్చిన రవి డీఎంకే ప్రభుత్వానికి తలనొప్పిగా మారారు. రాష్ట్ర పాలసీను విభేదించడం, బిల్లులు ఆమోదించకపోవడం వంటివి చేసి వివాదాలకు కేరాఫ్‌గా నిలిచారు. ఈ నేపథ్యంలో బెంగాల్ గవర్నర్‌గా రవి వైఖరి ఎలా ఉంటుందోనని తృణమూల్ వర్గాలు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.