News February 27, 2025
తిరుపతి: మైనర్ బాలుడికి 20 ఏళ్ల జైలు

ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ మైనర్ బాలుడికి తిరుపతి పొక్సో కోర్ట్ 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. శ్రీకాళహస్తి(M)లోని ఓ గ్రామానికి చెందిన 17ఏళ్ల బాలుడు చెడు వ్యసనాలకు అలవాడు పడి 2016లో అదే గ్రామానికి చెందిన 12ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారించిన జిల్లా పొక్సో కోర్ట్ న్యాయమూర్తి బాలుడికి 20 ఏళ్ల జైలు శిక్షతోపాటూ రూ.2వేల జరిమానా విధించారు.
Similar News
News November 19, 2025
జిల్లాలో 2.27 లక్షల మంది రైతులకు లబ్ది: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటోందని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అన్నారు. వేపాడ తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో జరిగిన అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ రెండవ విడత నిధుల విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్యే లలిత కుమారి కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. అధిక వర్షాలు నమోదవడం వల్ల జిల్లాలో వరి పంటకు మంచి దిగుబడి వచ్చిందని తెలిపారు. జిల్లాలో 2.27 లక్షల మంది రైతులకు రూ.150 కోట్లు జమచేశామన్నారు.
News November 19, 2025
72 గంటల పనివేళలు వారికోసమే: పాయ్

నారాయణ మూర్తి ప్రతిపాదించిన వారానికి 72 గంటల <<18309383>>సలహాను<<>> పారిశ్రామిక వేత్త మోహన్‌దాస్ పాయ్ గట్టిగా సమర్థించారు. అయితే ఈ సూచన సాధారణమైన ఉద్యోగులకు కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ కఠిన నిబంధన కేవలం దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనుకునే పారిశ్రామికవేత్తలు, వినూత్న ఆవిష్కర్తలకు మాత్రమే వర్తిస్తుందని పాయ్ అన్నారు. గ్లోబల్ పోటీని తట్టుకోవడానికి ఇన్నోవేటర్లు ఈ అంకితభావం చూపాలని ఆయన తెలిపారు.
News November 19, 2025
ఉపాధ్యాయులకు కాంప్లెక్స్ సమావేశాలు: డీఈఓ సత్యనారాయణ

విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఈ నెలలో కాంప్లెక్స్ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు డీఈఓ సత్యనారాయణ తెలిపారు. నవంబర్ 21, 22న ప్రాథమిక పాఠశాల, 24, 25న ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఈ సమావేశాల్లో పాల్గొనాలని ఆయన ఆదేశించారు. ఉపాధ్యాయులు రెండు రోజులు విడివిడిగా తప్పనిసరిగా హాజరు కావాలని డీఈఓ స్పష్టం చేశారు.


