News February 27, 2025

తిరుపతి: మైనర్ బాలుడికి 20 ఏళ్ల జైలు

image

ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ మైనర్ బాలుడికి తిరుపతి పొక్సో కోర్ట్ 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. శ్రీకాళహస్తి(M)లోని ఓ గ్రామానికి చెందిన 17ఏళ్ల బాలుడు చెడు వ్యసనాలకు అలవాడు పడి 2016లో అదే గ్రామానికి చెందిన 12ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారించిన జిల్లా పొక్సో కోర్ట్ న్యాయమూర్తి బాలుడికి 20 ఏళ్ల జైలు శిక్షతోపాటూ రూ.2వేల జరిమానా విధించారు.

Similar News

News March 27, 2025

కొత్తగూడెంలో నిరుద్యోగులకు GOODNEWS.. రేపే!

image

జిల్లాలో నిరుద్యోగ యువతకు భద్రాద్రి కొత్తగూడెం ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్ గుడ్ న్యూస్ చెప్పారు. పాల్వంచ డిగ్రీ కళాశాలలో ఈనెల 28న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండి SSC, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువత అప్లై చేసుకోవాలన్నారు. ప్రైవేటు కంపెనీల్లో 550 ఉద్యోగాలకు గాను ముఖాముఖి నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

News March 27, 2025

నటి రన్యా రావుకు షాక్

image

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యారావుకు షాక్ తగిలింది. ఆమె బెయిల్ పిటిషన్‌ను బెంగళూరు సెషన్స్ కోర్టు కొట్టివేసింది. మరోవైపు ఈ కేసులో రన్యా రావుకు సహకరించిన సాహిల్ జైన్‌ను తాజాగా డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు.

News March 27, 2025

రాష్ట్రం దివాలా తీసింది అనడానికి ఆధారాల్లేవు: కేటీఆర్

image

TG: బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయకుండానే రాష్ట్రంలో సంపద పెరిగిందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. అప్పులకు తగినట్లే సంపద పెరిగిందని అసెంబ్లీలో చెప్పారు. అప్పులు లేని వ్యక్తి, దేశం ఉండదని అన్నారు. అమెరికాలాంటి దేశాలు కూడా అప్పులు చేశాయన్నారు. రాష్ట్ర ఏర్పడిన రోజు సగటు ఆదాయం రూ.3,500 కోట్లు ఉంటే ఇప్పుడు రూ.18వేల కోట్లు ఉందన్నారు. రాష్ట్రం దివాలా తీసిందని అనడానికి ఆధారాలు లేవని చెప్పారు.

error: Content is protected !!