News September 23, 2024
తిరుపతి: యువకుడిపై పొక్సో కేసు

బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ యువకుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. తిరుపతి శివారులో ఉన్న తల్లి, తండ్రి బతుకుతెరువు కోసం బెంగళూరుకు వెళుతూ.. బాలికను అవ్వ దగ్గర వదిలారు. వరుసకు చెల్లి(13) అయిన బాలికపై యువకుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. వినాయక చవితికి వచ్చిన తల్లికి బాలిక జరిగిన విషయం చెప్పింది. బాలిక తల్లి అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు పొక్సో కేసు నమోదు చేశారు.
Similar News
News December 10, 2025
చిత్తూరులో 12 మంది ఎస్ఐల బదిలీ

షేక్షావలి: సదుం TO వి.కోట
నాగసౌజన్య: NRపేట TO డీటీసీ
శివశంకర: సోమల TO చిత్తూరు మహిళా PS
సుబ్బారెడ్డి: రొంపిచెర్ల TO సీసీఎస్, చిత్తూరు
చిరంజీవి: తవణంపల్లె TO చిత్తూరు 1టౌన్
శ్రీనివాసులు: గుడుపల్లి TO సదుం
వెంకట సుబ్బయ్య: వెదురుకుప్పం TO వీఆర్
NOTE: VRలో ఉన్న శ్రీనివాసరావు(DTC), డాక్టర్ నాయక్(తవణంపల్లె), నవీన్ బాబు(వెదురుకుప్పం), పార్థసారథి(CCS), ఎన్.మునికృష్ణ(CCS)కు బాధ్యతలు అప్పగించారు.
News December 10, 2025
చిత్తూరు: కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకోవాలని వినతి

ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకోవాలని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్కు వైసీపీ ఎంపీలు బుధవారం వినతిపత్రం అందజేశారు. రాజంపేట, తిరుపతి ఎంపీలు మిథున్ రెడ్డి, గురుమూర్తి, రాజ్యసభ ఎంపీ సుబ్బారెడ్డి తదితరులు ఆమెకు వినతిపత్రం అందజేశారు. కాలేజీల ప్రైవేటీకరణతో పేదలకు తీరని అన్యాయం జరుగుతుందని చెప్పారు.
News December 10, 2025
పలమనేరు-కుప్పం హైవేపై లారీ-RTC బస్సు ఢీ

పలమనేరు-కుప్పం జాతీయ రహదారిలోని వీకోట(M) జీడీగుట్ట సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని RTC బస్సు ఢీకొనడంతో 16 మంది ప్రయాణికులు గాయపడ్డారు. విజయవాడ నుంచి కుప్పం వస్తున్న ఆర్టీసీ లగ్జరీ బస్సు జీడీగుట్ట వద్ద ఆగి ఉన్న లారీని వెనకవైపు నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో 16 మంది ప్రయాణికులు గాయపడగా క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కుప్పం PES, ఏరియా ఆసుపత్రికి తరలించారు.


