News March 31, 2026

తిరుపతి: రీల్స్ కోసం పైఅంతస్తుకు.. బాలిక మృతి

image

రీల్స్ పిచ్చి ప్రాణాలను తీస్తున్నా యువతలో మార్పు రావడం లేదు. ఆ రీల్స్ పిచ్చితో 13 ఏళ్ల బాలిక మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి తిరుపతిలో జరిగింది. అలిపిరి పీఎస్ పరిధి రాజారెడ్డినగర్‌లోని సాయినివాస్ అపార్ట్‌మెంట్‌లో నేపాల్‌కు చెందిన ధనుబహదూర్ వాచ్‌ మెన్‌గా పనిచేస్తూ నివాసం ఉంటున్నాడు. అతడి కుమార్తె పుష్ప ఐదో అంతస్తులో రీల్స్ చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందింది. SI శ్రీవాణి కేసు నమోదు చేశారు.

Similar News

News April 20, 2026

@4PM సింహాచలం: స్వామివారిని ఎంతమంది దర్శించుకున్నారంటే..!

image

సింహాచలంలో స్వామి నిజరూప దర్శనం ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు 81,238 మంది స్వామిని దర్శించుకున్నట్టు అధికారులు వెల్లడించారు. క్యూ లైన్లలో బారులు తీరారు. వీరికి ఇబ్బంది కలగకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అయితే 6గంటల తరువాత భక్తులకు కొండ పైకి అనుమతించడం లేదన్నారు.

News April 20, 2026

NGKL: ఈ నెల 30న దత్తాత్రేయ ఆశ్రమానికి ప్రత్యేక బస్సు

image

NGKL ఆర్టీసీ డిపో నుంచి ఈనెల 30న కర్ణాటకలోని గానుగాపూర్ దత్తాత్రేయ ఆశ్రమానికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ యాదయ్య తెలిపారు. ఈ బస్సు 30న రాత్రి డిపో నుంచి బయలుదేరి మే 1న శనివారం తెల్లవారుజామున దత్తాత్రేయ ఆశ్రమానికి చేరుకుంటుందన్నారు. ఉదయం దత్తాత్రేయ స్వామి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో యానగుంది మానికేశ్వరీ మాత ఆశ్రమ దర్శనం ఉంటుందన్నారు. వివరాలకు 9490411591 సంప్రదించాలన్నారు.

News April 20, 2026

సేంద్రియ మేళా సూపర్‌ హిట్: కలెక్టర్

image

లూరులో నిర్వహించిన ‘రైతు సంపద’ సహజ, సేంద్రియ ఉత్పత్తుల మెగా మేళా విశేష స్పందనతో విజయవంతమైందని కలెక్టర్ వెట్రి సెల్వి సోమవారం తెలిపారు. రెండు రోజుల్లో 3,400 మంది సందర్శించగా, రూ. 11 లక్షల విక్రయాలు జరిగినట్లు వెల్లడించారు. వ్యవసాయ శాఖ జేడీ భాషా, అధికారులను సన్మానించిన కలెక్టర్.. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తు కార్యక్రమాలను నిర్వహిస్తూ జిల్లాను రాష్ట్రానికే ఆదర్శంగా నిలపాలని కోరారు.