News December 14, 2024

తిరుపతి: రెవెన్యూ సదస్సులో 593 ఫిర్యాదులు

image

తిరుపతి జిల్లాలో శుక్రవారం 43 ప్రాంతాలలో రెవెన్యూ సదస్సులు జరిగాయని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఇందులో సమస్యలపై 593 ఫిర్యాదులు అధికారులకు అందాయని ఆయన చెప్పారు. ఏడు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించినట్టు పేర్కొన్నారు. మిగిలిన వాటిని నిర్దేశించిన సమయంలో అధికారులు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.

Similar News

News September 16, 2025

చిత్తూరు జిల్లాలో లక్ష సంతకాలు సేకరిస్తాం: భాస్కర్

image

దేశంలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై చేపడుతున్న ఉద్యమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పోటుగారి భాస్కర్ పిలుపునిచ్చారు. చిత్తూరులో ఆయన మాట్లాడుతూ.. ఓటు చోరీపై చిత్తూరు జిల్లాలో లక్ష సంతకాల సేకరిస్తామని చెప్పారు. ప్రతి పార్టీ బీజేపీకి బానిసలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. జీడీ నెల్లూరు ఇన్‌ఛార్జ్ రమేశ్, నేతలు పాల్గొన్నారు.

News September 16, 2025

చిత్తూరు DCMS ఛైర్మన్ మృతి

image

చిత్తూరు డీసీఎం ఛైర్మన్, టీడీపీ చంద్రగిరి మండల అధ్యక్షుడు పల్లిమేమి సుబ్రహ్మణ్యం నాయుడు మంగళవారం తెల్లవారుజామున మృతిచెందారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నెల రోజులుగా చికిత్స పొందుతున్నారు. కోలుకోలేక తుది శ్వాస విడిచారు. ఆయన మృతికి పలువురు టీడీపీ నాయకులు సంతాపం తెలిపారు.

News September 16, 2025

చిత్తూరు: 19న మెగా జాబ్ మేళా

image

చిత్తూరు జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 19వ తేదీన మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి పద్మజ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం మూడు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ, ఎంబీఏ, ఎంకాం, పీజీ, డీ, బీ ఫార్మసీ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.