News April 13, 2024

తిరుపతి: రేపటి నుంచి 3 రోజులపాటు షర్మిల పర్యటన

image

వైయస్ షర్మిల మూడు రోజులు పర్యటించనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రీకాళహస్తిలో, సాయంత్రం 4 గంటలకు సత్యవేడులోని గాంధీ విగ్రహం సమీపంలో, రాత్రి 7.30కు పుత్తూరులో నాయకులతో సమావేశమవుతారు. సోమవారం ఉదయం 10.30 కార్వేటినగరంలో రోడ్డుషో, సమావేశం, 11.30 జీడీనెల్లూరులో, సాయంత్రం 5 గంటలకు పలమనేరు, రాత్రి 7.30 గంటలకు పూతలపట్టులో స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు. 16న అన్నమయ్య జిల్లాలో పర్యటిస్తారు.

Similar News

News September 30, 2024

సబ్ కలెక్టర్ రేట్ ఫైళ్ల దగ్ధం కేసులో రికార్డులు తీసుకెళ్లిన సిఐడి

image

మదనపల్లె సబ్ కలెక్టర్ రేట్ లో ఫైళ్ల దగ్ధం అనంతరం సీజ్ చేసిన రికార్థులను ఆదివారం ప్రత్యేకవాహనంలో తిరుపతి సిఐడి కార్యాలయానికి తీసుకెళ్లారు. శనివారం మదనపల్లెకు వచ్చిన సిఐడి డిఎస్పీ వేణుగోపాల్ రెండు రోజులపాటు స్థానిక డిఎస్పీ కార్యాలయంలో కేసులోని కొందరిని విచారించారు. అనంతరం అప్పట్లో కేసుకు సంబంధించి సీజ్ చేసిన రికార్డులు అన్నింటినీ స్వాధీనంచేసుకుని తీసుకెళ్లడంతో ఫైల్ దగ్ధం కేసు మరుగున పడిందనట్లయింది.

News September 30, 2024

మదనపల్లెలో టమాటా కిలో రూ. 60

image

మదనపల్లెలో టమాటా KG రూ.60 పలికింది. దిగుబడి తక్కువగా ఉండటంతో వ్యవసాయ మార్కెట్లో ధరలు పైపైకి పెరుగుతున్నాయి. ఆదివారం అత్యధికంగా కిలో ధర రూ.50 నుంచి రూ.60 వరకు పలికింది. 25 కిలోల క్రేట్ ధర రూ.1,500వరకు పలికిందని అధికారులు పేర్కొన్నారు. బయటరాష్ట్రాల్లో ఇటీవల కురిసిన వర్షాలతో పంటలేకపోవడంతో ఇక్కడి టమాటాకు డిమాండ్ పెరిగింది. వారంరోజులుగా కిలో రూ.44నుంచి రూ.50 వరకు పలకగా ఆదివారం రూ.60 చేరింది.

News September 30, 2024

పోలీస్ క్వార్టర్స్ స్థలం ఆక్రమించి కట్టిన ఇళ్లు కూల్చి వేత

image

మొలకలచెరువులో పోలీస్ క్వార్టర్స్ స్థలం ఆక్రమించి అక్రమంగా కట్టిన ఇళ్లను ఆదివారం కూల్చి వేశారు. సీఐ రాజారమేష్ కథనం.. ములకలచెరువు పోలీస్ క్వార్టర్స్‌కు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో స్థానికంగా ఉన్న కొందరు అక్రమంగా కబ్జా చేసి ఇళ్లను నిర్మించారు. రెండు రోజుల క్రితం జిల్లా అధికారుల ఆదేశాలతో రెవెన్యూ సిబ్బంది పోలీస్ క్వార్టర్స్ స్థలంలో సర్వే నిర్వహించి ఆక్రమణలపై నోటీసులు జారీచేసి కట్టడాలు కూల్చేశారు.