News August 19, 2024
తిరుపతి : రేపు జాబ్ మేళా

పద్మావతిపురంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో మంగళవారం ఉదయం 9 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తిరుపతి జిల్లా నైపుణ్యభివృద్ధి శాఖ అధికారి లోకనాథం పేర్కొన్నారు. డిక్సన్ కంపెనీ ప్రతినిధుల హాజరవుతారని తెలియజేశారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిప్లమా, డిగ్రీ, 18-30 సంవత్సరాల్లోపు అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన వారు https://rb.gy/6son88 గూగుల్ ఫాం లో పేర్లు రిజిస్టర్ చేసుకోవాలి సూచించారు.
Similar News
News February 12, 2025
బైరెడ్డిపల్లి: మహిళపై అత్యాచారయత్నం

బైరెడ్డిపల్లి ఎన్టీఆర్ కాలనీలోని ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ మహిళపై అత్యాచారానికి యత్నించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పరశురాముడు తెలిపారు. బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై అదే కాలనీకి చెందిన నాగరాజు అత్యాచారయత్నానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
News February 12, 2025
చిత్తూరు: టెన్త్ అర్హతతో 54 ఉద్యోగాలు

టెన్త్ అర్హతతో చిత్తూరు డివిజన్‌లో 54 GDS పోస్టుల భర్తీకి భారత తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సైకిల్ లేదా బైక్ నడిపే సామర్థ్యం, వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
News February 11, 2025
చిత్తూరు జిల్లా హెడ్‌లైన్స్

✒నగరి ఎమ్మెల్యే సోదరుడు వైసీపీలో చేరికకు బ్రేక్!
✒ పుంగనూరులో యువకుడి సూసైడ్
✒టీడీపీ ఎంపీలపై మిధున్ రెడ్డి ఫైర్
✒ 158 ఏళ్ల చరిత్ర కలిగిన మసెమ్మ జాతరరేపే ప్రారంభం
✒శ్రీవారి సేవలో సినీ నటుడు కార్తీ
✒SPMVV: ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
✒పెద్దిరెడ్డి ఓ దొంగ: MP శబరి