News August 9, 2024

తిరుపతి రైలుకు అదనపు బోగీలు ఏర్పాటు

image

గుంటూరు నుంచి గిద్దలూరు మీదుగా తిరుపతి వెళ్లే 17261/17262 ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రెండు అదనపు బోగీలను ఏర్పాటు చేస్తున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 9-21వ తేదీ వరకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ ఎక్స్‌ప్రెస్ రైలుకు అదనంగా రెండు జనరల్ బోగీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు ఉపయోగించుకోవాలని కోరారు.

Similar News

News September 30, 2024

చంద్రబాబు, పవన్ ముక్కు నేలకు రాయాలి: తాటిపర్తి

image

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు ముక్కు నేలకు రాసి హిందువులకు క్షమాపణలు చెప్పాలని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఫైర్ అయ్యారు. ‘తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, పవిత్రమైన వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని అవమానించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు ముక్కు నేలకు రాసి హిందువులకు, రాష్ట్ర, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని Xలో పోస్ట్ చేశారు.

News September 30, 2024

ప్రకాశం: పింఛన్ల పంపిణీకి రూ.122.64 కోట్లు విడుదల

image

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అక్టోబర్ నెలకు సంబంధించి ప్రకాశం జిల్లాలోని 2,88,144 మంది లబ్ధిదారులకు రూ.122.64 కోట్లు విడుదలైనట్లు డీఆర్డీఏ పీడీ వసుంధర తెలిపారు. 2వ తేదీ గాంధీజయంతి కావడంతో 1న పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు చెప్పారు. ఈ మేరకు మంగళవారం జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ పూర్తి చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. అధికారులు బ్యాంకుల నుంచి నగదు విత్‌డ్రా చేసుకోవాలన్నారు.

News September 30, 2024

ప్రకాశం జిల్లాలో దారుణ హత్య?

image

పామూరులోని 565 జాతీయ రహదారిపై లారీ డ్రైవర్ అనుమానాస్పదంగా సోమవారం మృతి చెందారు. రోడ్డు పక్కన పడి ఉన్న మృతదేహం కాళ్లు, చేతులు, మెడను తాళ్లతో కట్టి ఉండటంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడు పట్టణంలోని కరెంటు కాలనీకి చెందిన సిద్ధవటం వెంకటేశ్వర్లు (45)గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యా మరేదైనా కారణమా అన్న కోణంలో విచారిస్తున్నారు.