News February 14, 2025
తిరుపతి: రైలు ఢీకొని వ్యక్తి స్పాట్ డెడ్

రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గుర్తు తెలియని వ్యక్తి పట్టాలు దాటుతుండగా నెల్లూరు నుంచి చెన్నై వైపు వెళ్తున్న గూడ్స్ రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతదేహాన్ని సూళ్లూరుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Similar News
News March 20, 2025
GNT: బంగారం చోరీ.. పట్టించిన తండ్రి

జల్సాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్న యువకుడిని అతని తండ్రే పట్టాభిపురం పోలీసులకు అప్పగించాడు. కాకినాడకు చెందిన యువకుడు గుంటూరు విద్యానగర్‌లోని ఓ వ్యాపారి ఇంట్లో ఈ నెల 7న రూ. కోటి విలువ చేసే బంగారాన్ని చోరీచేశాడు. పోలీసులు విచారణ వేగవంతం చేయడంతో భయపడి చోరీ బంగారాన్ని పార్సిల్ ద్వారా పంపించాడు. ఆ తర్వాత తండ్రి ఆ నిందితుణ్ణి స్టేషన్‌లో అప్పగించినట్లు తెలుస్తోంది.
News March 20, 2025
బెట్టింగ్ యాప్స్ వ్యవహారం.. టాప్ సెలబ్రిటీలపై కేసు

TG: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన సెలబ్రిటీలపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. విజయ్ దేవరకొండ, రానా, ప్రకాశ్ రాజ్, ప్రణీత, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగళ్లతో పాటు 18 మంది ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసు నమోదైంది. వీరిలో శ్రీముఖి, సిరి, వర్షిణి, వాసంతి, శోభా శెట్టి, అమృత, పావని, నేహ, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, సన్నీ యాదవ్, శ్యామల, టేస్టీ తేజ, రఘు, సుప్రీత ఉన్నారు.
News March 20, 2025
BREAKING: హైకోర్టులో హరీశ్ రావుకు ఊరట

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. పంజాగుట్ట పీఎస్‌లో నమోదైన కేసు కొట్టివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. తన ఫోన్ ట్యాపింగ్ చేశారని చక్రధర్ అనే వ్యక్తి హరీశ్‌తో పాటు అప్పటి డీసీపీ రాధాకిషన్ రావుపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కేసు కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.