News February 6, 2025

తిరుపతి: రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెళ్ల మృతి

image

చిత్తూరు జిల్లా విజయపురం మండల తెల్లగుంట గ్రామ సమీపంలో అన్నాచెల్లెలు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. బంధువుల సమాచారం మేరకు.. నిండ్ర మండలం అగరం పేట గ్రామానికి చెందిన రవి(48), KVB.పురం మండలం కళత్తూరు గ్రామానికి చెందిన మంజుల (44)అన్నా చెల్లెలు. వారు ఇద్దరు కలిసి పెద్ద అక్క దేశమ్మ ఇంటికి వెళ్లి తిరిగి ప్రయాణంలో తెల్లగుంట వద్ద లారీ ఢీకొని మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News February 6, 2025

రాజమండ్రి: పవన్ కల్యాణ్ కోసం జన సైనికుల పూజలు

image

అస్వస్థతకు గురైన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదల పవన్ కల్యాణ్‌కు సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని ఆకాంక్షిస్తూ గురువారం జనసేన నాయకులు వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమండ్రి దేవీచౌక్‌లోని శ్రీ బాలాత్రిపుర సుందరిదేవి, శ్రీ ఉమా బసవలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు, ప్రార్థనలు చేశారు. జనసేన నాయకులు సూర్య బయ్యపునీడి, విక్టరీ వాసు, చక్రపాణి, విన్నా వాసు తదితరులు పాల్గొన్నారు.

News February 6, 2025

19 నుంచి శ్రీకపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు

image

తిరుపతి శేషాచలం పర్వతాల్లో వెలసిన శ్రీకపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్ర‌వ‌రి 19 నుంచి 28వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 18న శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహిస్తారు. బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 15న ఆల‌యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం నిర్వ‌హించ‌నున్నారు. రోజూ ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుంచి వాహన సేవలు జరగనున్నాయి.

News February 6, 2025

PPM: నిర్ణిత కాల వ్యవధిలోగా మ్యూటేషన్లు పరిష్కరించాలి

image

రీసర్వే, రెవెన్యూ సదస్సులు, మీ సేవా పోర్టల్ ద్వారా వచ్చే మ్యూటేషన్లను నిర్ణిత కాల వ్యవధిలోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తహశీల్దార్లకు సూచించారు. 30 రోజులు దాటి ఒక్క రోజు ఆలస్యమైన సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెవెన్యూ సమస్యలపై సబ్ కలెక్టర్లు, తహశీల్దార్లు, రెవిన్యూ అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో గురువారం సమీక్షించారు.

error: Content is protected !!