News September 11, 2025

తిరుపతి: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

తిరుపతి రూరల్ తుమ్మలగుంట రోడ్డు తుడా ఆఫీస్ సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. చిత్తూరు టౌన్ చామంతి పురానికి చెందిన కొమరవెల్లి కార్తీక్ (26) బైక్‌‌పై అతివేగంతో వెళ్లి డివైడర్‌ను ఢీకొని మృతి చెందినట్లు తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ చిన్ని గోవిందు తెలిపారు. మృతుడి తల్లి కె.సుధ ఫిర్యాదు మేరకు తిరుపతి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News March 3, 2026

పనికిమాలిన మాటలు ప్రతి నటుడూ చెబుతాడు: సత్యరాజ్

image

విషయం లేనివారే సినిమా డైలాగులు చెబుతారని TVK చీఫ్ విజయ్‌ని ఉద్దేశించి నటుడు సత్యరాజ్ కామెంట్స్ చేశారు. ‘పంచ్ డైలాగులు జనం చప్పట్లకు మాత్రమే పనికొస్తాయి. సినిమా వేరు, రాజకీయాలు వేరు. పనికిమాలిన మాటలు ప్రతి నటుడూ చెబుతాడు’ అని విమర్శించారు. ఇక TNను మరో అయోధ్యగా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో సనాతన Vs ద్రావిడ సిద్ధాంతం మధ్యే పోటీ అని, స్టాలిన్ ఉన్నంతవరకు మతశక్తులకు చోటు ఉండదన్నారు.

News March 3, 2026

పాలమూరు: ఆగని హిజ్రాల ఆగడాలు..!

image

ఉమ్మడి MBNR జిల్లాలో హిజ్రాల ఆగడాలు ఆగడం లేదంటూ పలువురు బాధితులు వాపోతున్నారు. శుభకార్యాలు, నూతన గృహప్రవేశాలు చేస్తే కొందరు హిజ్రాలు వచ్చి తాము అడిగినంత ఇవ్వాల్సిందేనంటూ దౌర్జన్యం చేస్తున్నారంటున్నారు. తాజాగా గద్వాల శివారులో హిజ్రాలు బరితెగించారు. కూతురిని పరీక్ష కేంద్రానికి తీసుకెళ్తున్న ఓ తండ్రిని అడ్డుకున్నారు. చిల్లర లేదని, ఎగ్జామ్‌కు లేట్ అవుతుందని చెప్పినా వినకుండా రూ.500 గుంజుకున్నారు.

News March 3, 2026

మంత్రి ఆకస్మిక తనిఖీ.. బల్కంపేట ఆలయ ఈవో సస్పెండ్

image

బల్కంపేట ఎల్లమ్మ ఆలయ ఇన్‌ఛార్జీ ఈఓ తమ్మినేని శేఖర్‌ను సస్పెండ్ చేస్తూ దేవదాయ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఆ శాఖ మంత్రి కొండా సురేఖ ఆలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి నిర్వహణపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు నెలల్లో అన్ని మారాలని అధికారులకు హెచ్చరించారు. నిర్వహణలో బాధ్యత రహితంగా వహించిన వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించగా అధికారులు సస్పెండ్ చేశారు.