News February 14, 2025
తిరుపతి: లోకేశ్‌ను కలిసిన రాకేశ్ కుటుంబ సభ్యులు

ఏనుగుల దాడిలో మృతి చెందిన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లె ఉపసర్పంచ్ రాకేశ్ చౌదరి కుటుంబ సభ్యులు శుక్రవారం ఉండవల్లిలో మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. ఈ సందర్భంగా లోకేశ్ వారితో మాట్లాడుతూ.. ఏనుగుల దాడిలో రాకేశ్ మరణించడం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని వ్యాఖ్యానించారు. మృతుడి కుటుంబానికి అన్నివిధాల అండగా ఉంటానని లోకేశ్ హామీ ఇచ్చారు.
Similar News
News September 18, 2025
ఇద్దరు MBBS విద్యార్థుల ఆత్మహత్య

AP: విశాఖ గీతం మెడికల్ కాలేజీలో హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన MBBS ఫస్ట్ ఇయర్ విద్యార్థి విస్మాద్ సింగ్ (20) ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. నిన్న కాలేజీ ఆరో అంతస్తు నుంచి కిందకు దూకి సూసైడ్ చేసుకున్నాడు. ‘ఈ లోకంలో నేను బతకలేను. నాకు మరో జన్మ వద్దు’ అని రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు MBBS ఫస్టియర్‌లో ఫెయిలైన విశాఖ NRI కాలేజీ స్టూడెంట్ జ్యోత్స్న ఆత్మహత్య చేసుకుంది.
News September 18, 2025
HYD: ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచండి: కమిషనర్

HYD సిటీ ఇన్నోవేషన్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (H-CITY) స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్(SNDP) పనులను మరింత వేగవంతం చేయాలని కమిషనర్ కర్ణన్ అధికారులను ఆదేశించారు. పనుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా తగిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా పెండింగ్ పనులపై ఇంజినీర్లు ఫోకస్ పెట్టాలని సూచించారు.
News September 18, 2025
HYD: నీటి నాణ్యత పరీక్షలపై జలమండలి ఫోకస్

జీహెచ్ఎంసీ నుంచి ORR వ్యాప్తంగా నల్లా నీటి నాణ్యతపై జలమండలి ప్రత్యేక నజర్ పెట్టింది. ఇందులో భాగంగానే క్లోరినేషన్ ప్రక్రియ, పంపింగ్, డిస్ట్రిబ్యూషన్ వంటి వాటిని పరిశీలిస్తోంది. అనేకచోట్ల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. క్లోరిన్ బిల్లల సరఫరాకు ప్రణాళిక సిద్ధం చేసింది. నెలకు లక్షకుపైగా శాంపిల్స్ సేకరిస్తున్నట్లు ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు.