News September 4, 2024

తిరుపతి: విమాన ప్రయాణికుడిపై కేసు నమోదు

image

విమానం టేకాఫ్‌కు అంతరాయం కలిగించిన ప్రయాణికుడిపై ఏర్పేడు పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ జయచంద్ర వివరాల మేరకు.. తిరుపతి విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు సోమవారం ఉదయం ఓ విమానం బయలుదేర్డానికి సిద్ధమైంది. టేకాఫ్ సమయంలో మయూర్ దిలీప్ హోలే అనే వ్యక్తి చేయి అత్యవసర స్విచ్‌కు తగలడంతో విమానం నిలిచిపోయింది. దీంతో ఎయిర్‌పోర్టు అధికారుల ఫిర్యాదు మేరకు ప్రయాణికుడిపై కేసు నమోదు చేశారు.

Similar News

News September 19, 2024

తిరుపతి: RTCలో అప్రెంటీస్‌‌షిప్‌నకు నోటిఫికేషన్

image

ఆర్టీసీలో అప్రెంటిస్‌షిప్ చేయడానికి ఐటీఐ ఉత్తీర్ణులైన వారు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని కడప జోన్-4 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చెంగల్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో డీజిల్ మెకానిక్ 97, మోటార్ మెకానిక్ 6, ఎలక్ట్రిషియన్ 25, వెల్డర్ 4, పెయింటర్ 2, ఫిట్టర్ 9, డ్రాఫ్ట్ మెన్ సివిల్ 1 పోస్టులు ఖాళీలు ఉన్నాయని చెప్పారు. అక్టోబర్ 3వ తేదీలోపు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News September 19, 2024

CM సహాయనిధికి చంద్రగిరి మాజీ MLA రూ.2 కోట్లు విరాళం

image

వరద బాధితుల సహాయార్థం చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే గల్లా అరుణ కుమారి ముఖ్యమంత్రి సహాయ నిధికి రెండు కోట్లు ఆర్థిక సహాయం అందజేశారు. ఆర్థిక సహాయ చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబీకులు పాల్గొన్నారు.

News September 19, 2024

చిత్తూరు: 66 మంది డీటీలు ట్రాన్స్ ఫర్

image

చిత్తూరు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 66 మంది డిప్యూటీ తహశీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. హెడ్ క్వార్టర్స్ లో పనిచేస్తున్న 25 మంది డీటీలు, రీసర్వే డీటీలు 26 మంది, ఎన్నికల డీటీలు నలుగురు, ఆర్డీవో కార్యాలయాల్లో పనిచేస్తున్న డీటీలు ఐదుగురు, డీఎస్వో కార్యాలయంలో పనిచేస్తున్న ఆరుగుర్ని బదిలీచేశారు. అలాగే 17 మంది వీఆర్వోలు బదిలీ అయ్యారు.