News April 7, 2025
తిరుపతి: వివిధ పథకాలకు రూ.కోటి విరాళం

టీటీడీ నిర్వహిస్తున్న వివిధ పథకాలకు రూ.కోటి విరాళంగా అందింది. ఈ మేరకు ఒడిశాకు చెందిన శివమ్ కాండేవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.20 లక్షలు, ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు రూ.20 లక్షలు, స్విమ్స్ ట్రస్టుకు రూ.20 లక్షలు, ఎస్వీ సర్వ శ్రేయాస్ ట్రస్టుకు రూ.10 లక్షలు, ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్ట్‌కు రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చింది.
Similar News
News April 8, 2025
ధర్మపురి: గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య

ధర్మపురి మండలంలోని రాయపట్నం గోదావరిలో దూకి హషాం అహ్మద్(45) ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన అహ్మద్ కొంతకాలం నుంచి ఫైనాన్స్ విషయంపై బాధపడుతున్నాడన్నారు. ఉదయం రాయపట్నం గోదావరిలో మృతదేహం కనిపించగా తండ్రి మహమ్మద్ అలీకి అహ్మద్ ఆచూకీ తెలిపామని ఎస్సై వివరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని JGTL ఏరియా ఆసుపత్రికి తరలించారు.
News April 8, 2025
రెండేళ్లలో 12 భాషల్లో ఇంజినీరింగ్ పుస్తకాలు

మరో రెండేళ్లలో 12 భాషల్లో ఇంజినీరింగ్ పుస్తకాలు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రక్రియ వేగవంతమైందని AICTE ఛైర్మన్ సీతారాం తెలిపారు. ఇంజినీరింగ్ డిప్లోమా, డిగ్రీ కోర్సుల మొదటి, రెండో సంవత్సరాల కోసం 600 పుస్తకాలు సిద్ధమైనట్లు తెలిపారు. 3, 4వ సంవత్సరాలకు సంబంధించిన పుస్తకాలను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. ఈ పుస్తకాలను అనువదించేందుకు ఏఐ సాంకేతికను ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు.
News April 8, 2025
NLG జిల్లా ప్రజలపై రూ.3 కోట్ల భారం !

మరోసారి వంటగ్యాస్ ధరలు పెరిగాయి. గృహ వినియోగ సిలిండర్‌పై రూ.50 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు నేటి నుంచి అమలులోకి వస్తాయి. దీంతో ప్రస్తుతం రూ.875గా ఉన్న సిలిండర్ ధర సవరించిన ధర రూ.50లతో కలిపి రూ.925కు చేరింది. ప్రస్తుతం రూ.503గా ఉన్న ఉజ్వల్ సిలిండర్‌కు కూడా పెంపు వర్తిస్తుందని తెలిపారు. దీంతో ఉజ్వల్ సిలిండర్ రూ.553కు చేరుకోనుంది. జిల్లా ప్రజలపై సుమారు 3 కోట్లకు పైగా భారం పడనుంది.