News May 4, 2024

తిరుపతి: వివిధ పరీక్షల ఫలితాలు విడుదల

image

శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది ఫిబ్రవరిలో MED మూడవ సెమిస్టర్, BPED మొదటి సెమిస్టర్, DPED మొదటి సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షలు విభాగ నియంత్రణ అధికారి ధామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను https://www.manabadi.co.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

Similar News

News September 19, 2025

చిత్తూరు: టమాటా ప్రాసెసింగ్ యూనిట్ కలేనా..?

image

చిత్తూరు జిల్లా టమాటా పంటకు పెట్టింది పేరు. ఆసియాలోనే అతి పెద్ద టమాటా మార్కెట్‌గా పేరు గడించింది. రోజుకు 1,500 టన్నుల పంటకు ఇక్కడ వేలం నిర్వహించే అవకాశం ఉంది. ఇంత ఉన్నా రైతులు మాత్రం నష్టాలతో పంటను సాగు చేస్తున్నారు. ఏళ్ల తరబడి పాలకులు టమాటో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని చెబుతున్నా కార్యరూపం మాత్రం దాల్చ లేదు. ఇప్పటికైనా పాలకులు దీనిపై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.

News September 18, 2025

కాణిపాకం ఆలయ చైర్మన్‌గా మణి నాయుడు

image

కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం ఆలయ ఛైర్మన్‌గా వి.సురేంద్ర నాయుడు అలియాస్ మణి నాయుడును నియమిస్తూ దేవదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలోనూ ఆయన కాణిపాకం ఆలయ చైర్మన్‌గా విధులు నిర్వహించారు. రెండోసారి బాధ్యతలను అప్పజెప్పడంతో సీఎం చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

News September 18, 2025

జిల్లాలో 3,293 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ: కలెక్టర్

image

జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. చిత్తూరు, పూతలపట్టు, జీడీ నెల్లూరు, కుప్పం, పలమనేరు, పుంగనూరు, నగరి నియోజకవర్గ పరిధిలోని 125 క్లస్టర్లలో 3,293 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందన్నారు. ఆర్ఎస్కేలు, ప్రైవేటు దుకాణాలు, సొసైటీలలో యూరియా పంపిణీ పకడ్బందీగా చేపట్టాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.