News April 10, 2025
తిరుపతి: విషం పెట్టి చంపేశారా..?

చంద్రగిరి(M) నరసింగాపురంలో యువతి <<16044546>>మృతిపై <<>>ఆమె ప్రియుడు అజయ్ సంచలన విషయాలు చెప్పాడు. ‘మూడేళ్లుగా ప్రేమించుకుని గతేడాది గుడిలో పెళ్లి చేసుకున్నాం. ఆమె తల్లిదండ్రులు నాపై పోక్సో కేసు పెట్టి జైలుకు పంపారు. గర్భం రావడంతో అబార్షన్ చేయించారు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ఆమె నన్ను కలిసింది. దీంతో తన అమ్మానాన్న విషం పెట్టి చంపేస్తారని ఆమె నాకు మెసేజ్ చేసింది. ఆ పక్కరోజే ఆమె చనిపోయింది’ అని అజయ్ తెలిపాడు.
Similar News
News November 25, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 25, 2025
విజేతలుగా కడప జిల్లా టీంలు

పులివెందులలో నిర్వహించిన 69వ రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ అండర్ – 14 బాలుర, బాలికల ఫైనల్స్‌లో విజేతలుగా కడప జిల్లా జట్లు నిలిచాయి. ఇక రన్నర్‌గా ఈస్ట్ గోదావరి జట్టు నిలిచింది. 6-4 తేడాతో బాలుర జట్టు విజయకేతనం ఎగురవేసింది. బాలికల జట్టు గోదావరి జట్టుపై 2-1 తేడాతో గెలిచింది. ఇందులో అనూష ఉత్తమ ప్రతిభ కనబరిచింది. వీరికి ఎంఈవో చంద్రశేఖర్ బహుమతులు అందజేశారు.
News November 25, 2025
అన్నమయ్య: ఒక్కో విద్యార్థికి రూ.3 వేలు విడుదల

అన్నమయ్య జిల్లాలోని పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థుల విద్యాభ్యాసాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుందని జిల్లా సాధారణ పరీక్షా మండలి కార్యదర్శి తాటిపర్తి గంగాధరం సోమవారం తెలిపారు. విద్యార్థులకు చేయూతగా రవాణా భత్యంను మంజూరు చేసిందన్నారు. మొత్తం 3,039 మంది విద్యార్థులకు తొలి విడతగా.. ఒక్కో విద్యార్థికి రూ.3,000 చొప్పున నిధులను విడుదల చేసిందని తెలిపారు.


