News September 21, 2024

తిరుపతి వెళ్లే రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

కొవ్వూరు-కడియం రైల్వే సెక్షన్ల మధ్య నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా ప్రయాణించే 2 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఈ మేరకు తిరుపతి(TPTY)-విశాఖపట్నం(VSKP) మధ్య ప్రయాణించే ఏసీ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్‌ నం.22708 TPTY-VSKP రైలును ఈ నెల 29న, నం.22707 VSKP-TPTY రైలును ఈ నెల 30న రద్దు చేశామని రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

Similar News

News October 16, 2025

అంగలూరులో రాష్ట్రంలో మొట్టమొదటి బాలికల పాఠశాల

image

గుడ్లవల్లేరు అంగలూరు గ్రామంలో చల్లపల్లి జమిందార్ జ్ఞాపకార్థంగా బాలికల పాఠశాల ప్రారంభించారు. స్వాతంత్య్రం రాక ముందు బాలికలకు విద్య దూరంగా ఉండేది. దీంతో 1946లో ఈ స్కూల్ ప్రారంభించి బాలికా విద్యకు పునాది వేశారు. జమిందారీ దాతృత్వంతో 96 సంవత్సరాల అద్భుత ప్రయణం సాగుతోంది. రాష్ట్రంలోనే అత్యంత పురాతనమైన బాలికల ప్రభుత్వ పాఠశాలగా గుర్తింపు పొందింది. ఇటీవల జిల్లాస్థాయి స్వచ్ఛ పాఠశాల అవార్డు అందుకుంది.

News October 16, 2025

గన్నవరంలో యాక్సిడెంట్.. స్పాట్ డెడ్

image

గన్నవరం జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ – ద్విచక్ర వాహనం ఢీ కొనడంతో బైకుపై ఉన్న వ్యక్తి మృతి చెందాడు. మృతుడు బాపులపాడు మండలానికి చెందిన గరికిపాటి సుబ్బారావుగా గుర్తించారు. అతను రైల్వే శాఖలో పని చేసి రిటైర్ అయ్యారు. మార్కెట్ నుంచి సరుకులకు తీసుకొని వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.

News October 16, 2025

కృష్ణా: బీరు బాటిళ్ల స్కాన్‌పై మందుబాబుల ఆందోళన.!

image

కల్తీ మద్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సురక్ష యాప్‌’పై వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. తాజాగా యాప్‌లో బీరు బాటిళ్లను స్కాన్ చేస్తే ‘ఇన్వ్యాలిడ్’ అని చూపించడం గమనార్హం. దీనిపై మద్యం తాగేవారు, దుకాణదారులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. యాప్‌లో సాంకేతిక లోపం ఉందా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.