News April 9, 2024

తిరుపతి: వేసవికి ప్రత్యేక రైళ్లు

image

వేసవి సెలవుల నేపథ్యంలో రైలు ప్రయాణికుల సౌకర్యార్థం ద.మ.రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. తిరుపతి- మచిలీపట్నం (07121) రైలు ఏప్రిల్ 14, 21, 28 తేదీల్లో, మే 5, 12, 19, 26 తేదీల్లో నడపనున్నారు. మచిలీపట్నం- తిరుపతి (07122) రైలు ఏప్రిల్ 15, 22, 29 తేదీల్లో, మే 6, 13, 20, 27 తేదీల్లో నడవనుంది. ఈ ప్రత్యేక రైళ్లు నిర్దేశించిన తేదీల్లో తిరుపతి నుంచి రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు వైపు వెళుతాయి .

Similar News

News December 24, 2024

కరుణ, త్యాగానికి ప్రతి క్రిస్మస్: తిరుపతి కలెక్టర్

image

కరుణ, ప్రేమ మార్గం జీసస్ మార్గం అని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. జిల్లా క్రిస్టియన్ మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో క్రిస్మస్ హై టీ వేడుకలు స్థానిక జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, చర్చి పాస్టర్లు, పలువురు క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

News December 23, 2024

చంద్రగిరి: హైవేపై ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్

image

చంద్రగిరి మండలం, కోదండరామాపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళుతున్న బైక్‌ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై తిరుపతికి వస్తున్న దంపతుల్లో భర్త అక్కడిక్కడే మృతి చెందగా, భార్య తీవ్రంగా గాయపడింది. కొంత దూరం వెళ్లి కారు వదిలి డ్రైవర్ పరారయ్యాడు. మృతుడు తిరుచానూరుకు చెందిన బాలాజీగా పోలీసులు గుర్తించారు‌. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News December 23, 2024

CTR: ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం

image

చిత్తూరు వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని హాస్పిటల్లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ పద్ధతిలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DMHO కార్యాలయం తెలిపింది. ల్యాబ్ టెక్నీషియన్-03, ఫిమేల్ నర్సింగ్-07, సానిటరీ అటెండర్‌ కం వాచ్మెన్-06 మొత్తం 16 ఖాళీలు ఉన్నట్లు వివరించారు. అర్హత, ఇతర వివరాలకు https://chittoor.ap.gov.in/ వెబ్ సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 27 అని పేర్కొన్నారు.