News December 25, 2024

తిరుపతి: వైకుంఠ ఏకాదశికి పటిష్ఠ బందోబస్తు

image

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ సుబ్బారాయుడు చెప్పారు. భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో టోకెన్లు జారీ చేసే కేంద్రాలలో తోపులాటలు చోటు చేసుకోకుండా, క్యూలైన్లను క్రమబద్ధీకరించేలా తగినంత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజలు కూడా సహకరించి క్యూ లైన్లలో తోపులాటలు జరపకుండా టోకెన్లు పొందాలని సూచించారు. టీటీడీ, పోలీసుల సూచనలు పాటించాలన్నారు.

Similar News

News October 14, 2025

చిత్తూరు: యువతకు క్రీడా పోటీలు

image

వివేకానంద జయంతి సందర్భంగా జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో యువతకు వివిధ ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ఓ ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలో ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయికి, అక్కడ బాగా ఆడితే జాతీయస్థాయిలో నిర్వహించే యువజన పోటీలకు పంపిస్తామని చెప్పారు. జిల్లాస్థాయి పోటీలు ఈనెల 15న చిత్తూరు సమీపంలోని ఎస్వీ ఇంజినీరింగ్ కాలేజీలో జరుగుతాయన్నారు.

News October 13, 2025

చిత్తూరు పోలీసులకు 34 ఫిర్యాదులు

image

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. వివిధ సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. బాధితుల నుంచి 34 అర్జీలు అందినట్లు అధికారులు తెలిపారు. చట్ట ప్రకారం వీటిని పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ ఆదేశించారు. ఇందులో అత్యధికంగా భూతగాదాలపై 13 ఫిర్యాదులు అందాయి.

News October 13, 2025

చిత్తూరు: నేటి నుంచి విధుల్లోకి కొత్త టీచర్లు

image

DSC-2025 ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు ఇవాళ వారికి కేటాయించిన పాఠశాలలో జాయిన్ కానున్నారు. ఈ మేరకు DEO వరలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. నూతన ఉపాధ్యాయులు 11 రోజుల శిక్షణ పూర్తిచేసుకున్నారు. SGTలకు మ్యానువల్ పద్ధతిలో స్కూల్ అసిస్టెంట్లకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించారు.