News October 20, 2024
తిరుపతి: వైసీపీ అధ్యక్షుడిగా భూమన

తిరుపతి, చిత్తూరు జిల్లాల వైసీపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు జిల్లాతో పాటు తిరుపతి జిల్లాకు చెందిన తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలకు ఆయన అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. భూమనను పలువురు కలిసి అభినందించారు.
Similar News
News November 16, 2025
చిత్తూరు DRO కీలక ఆదేశాలు

చిత్తూరు జిల్లాలోని మండల స్పెషల్ ఆఫీసర్లు ప్రతి బుధ, గురువారాల్లో HODలతో కలసి క్షేత్రస్థాయిలో పర్యటించాలని DRO మోహన్ కుమార్ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారం, ఇతర అంశాలపై జిల్లా అధికారులు, మండల స్పెషల్ అధికారులతో ఆయన శనివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మండల స్థాయి గ్రీవెన్స్ల పరిష్కారంపై దృష్టిసారించి నివేదిక సమర్పించాలన్నారు. ప్రజలకు నాణ్యమైన పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News November 15, 2025
పవన్ పర్యటనతో ఒరిగిందేమి లేదు: వేంకటే గౌడ

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలమనేరు పర్యటన వల్ల ప్రజలకు, రైతులకు ఒరిగిందేమి లేదని మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ మండిపడ్డారు. ఏనుగుల క్యాంపునకు వచ్చిన ఆయన ఏనుగుల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించి ఉంటే వారి బాధలు తెలిసేవన్నారు. కనీసం ఏనుగు దాడిలో గాయపడ్డ సుకుమార్ పక్కనే ఉన్నా పలకరించలేదన్నారు. పార్టీ క్యాడర్ కూడా లోపలికి రానివ్వకపోవడం దారుణమన్నారు.
News November 15, 2025
కుప్పం: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

కుప్పం రైల్వే స్టేషన్ సమీపంలోని DK పల్లి రైల్వే గేట్ వద్ద శుక్రవారం రాత్రి రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం చెందాడు. మృతుడి ముఖం గుర్తుపట్టలేని విధంగా ఛిద్రం కావడంతో రైల్వే పోలీసులు మృతదేహాన్ని కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి సంబంధించిన వివరాలు ఎవరికైనా తెలిస్తే 9000716436, 80740 8806 నంబర్కి సమాచారం తెలియజేయాలని రైల్వే పోలీసులు తెలిపారు.


