News September 6, 2024
తిరుపతి: సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
తిరుపతిలోని జాతీయ సంస్కృత యూనివర్సిటీ సర్టిఫికెట్ ప్రోగ్రాం ఇన్ కమ్యూనికేటివ్ అండ్ ఫంక్షనల్ సాన్‌స్క్రిట్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ సితార్, సర్టిఫికెట్ ప్రోగ్రాం ఇన్ ట్రాన్స్లేషన్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. రోజూ 2 గంటల పాటు తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు nsktuadmission.samarth.edu.inలో రిజిస్టర్ చేసుకోవాలి. చివరి తేదీ సెప్టెంబర్ 06.
Similar News
News October 7, 2024
శ్రీవారి గరుడసేవకు విస్తృతమైన ఏర్పాట్లు : టీటీడీ ఈవో
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 8వ తేదీ సాయంత్రం శ్రీ మలయప్ప స్వామి విశేషమైన గరుడ వాహనంపై సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విహరిస్తారని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఆదివారం సాయంత్రం ఎస్పీ శ్రీ సుబ్బరాయుడుతో కలిసి ఈవో మీడియా సమావేశం నిర్వహించారు.
News October 6, 2024
జీడీ నెల్లూరులో ఆన్లైన్ బెట్టింగ్‌కు కుటుంబం మొత్తం బలి
గంగాధర నెల్లూరులో ఆన్లైన్ బెట్టింగ్‌తో అప్పుల పాలైన నాగరాజు కుటుంబ సభ్యులు శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నిన్న రాత్రి నాగరాజు రెడ్డి మరణించగా శనివారం ఉదయం చికిత్స పొందుతూ ఆయన భార్య జయంతి, సాయంత్రం కుమార్తె సునిత మృతి చెందారు. ఆదివారం ఆయన కొడుకు దినేశ్ రెడ్డి కూడా మరణించాడు. ఆ కుటుంబంలో నలుగురు చనిపోవడంతో గ్రామంలో విషదఛాయలు అలుముకున్నాయి.
News October 6, 2024
చిత్తూరు: వినాయక విగ్రహం నిమజ్జనంలో అపశ్రుతి
చిత్తూరులోని వినాయక విగ్రహం నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. చిత్తూరు నగరం గుర్రప్పనాయుడువీధికి చెందిన ఆకాశ్(14) కట్టమంచి చెరువులో దిగి కూరుకుపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అకాశ్‌ను వెలికితీసి ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చెరువు వద్ద తల్లిదండ్రుల ఆర్తనాదాలు పలువురిని కంటతడిపెట్టించాయి. చెరువులోకి ఒక్కడే దిగినట్లు సమాచారం.