News October 2, 2024
తిరుపతి: స్వర్ణాంధ్ర 2047@ విజన్ ను ప్రణాళికలు సిద్ధం
జిల్లా సమగ్ర అభివృద్దే లక్ష్యంగా సర్ణాంధ్ర @ 2047 విజన్ ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం భన్సల్ స్వర్ణాంధ్ర@ 2047 అమలుపై ప్రజా ప్రతినిధులు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, రైతు సంఘాలు, జిల్లా అధికారులతో ఒక రోజు వర్క్ షాప్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Similar News
News October 13, 2024
తిరుపతి కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు
భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతి కలెక్టరేట్‌లో 24X7 కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 08772236007 నంబరుకు సమాచారం కొరకు అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని కైలాసకోన, అరై, తలకోన తదితర వాటర్ ఫాల్స్, సముద్ర బీచ్ ప్రాంతాలలో రేపటి నుంచి 17 వరకు సందర్శకులకు అనుమతి లేదని కలెక్టర్ వెంకటేశ్వర్ చెప్పారు.
News October 13, 2024
పేరూరు వద్ద 108 ఢీకొని రిటైర్డ్ ఉద్యోగి మృతి
తిరుపతి రూరల్ మండలం పేరూరు జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. బైపాస్ దాటుతున్న బైక్‌ను 108 వాహనం ఢీకొని ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతుడు పేరూరుకు చెందిన రిటైర్డ్ అగ్రికల్చర్ ఉద్యోగి సుబ్రమణ్యం రెడ్డిగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News October 13, 2024
పలమనేరు : 17న జాబ్ మేళా
APSSDC ఆధ్వర్యంలో 17వ తేదీన పలమనేరు పట్టణంలోని SVCR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చిత్తూరు జిల్లా నైపుణ్య అభివృద్ధి శాఖ అధికారి గుణశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. 2 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని తెలియజేశారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, బి ఫార్మసీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. స్థానిక, పరిసర ప్రాంత నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.