News March 19, 2025

తిరుపతి: హిందీ పరీక్షకు 272 మంది గైర్హాజరు

image

తిరుపతి జిల్లాలో రెండవ రోజు పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు విద్యాశాఖ అధికారి కెవిఎన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 26,413 మంది విద్యార్థులు హాజరైనట్లు చెప్పారు. 272 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. బుధవారం ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని వెల్లడించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు బస్సు సౌకర్యం కల్పించినట్లు చెప్పారు.

Similar News

News January 7, 2026

విశాఖ: పరువు నష్టం దావా.. ఈనెల 21కి కేసు వాయిదా

image

తనపై ఓ పత్రిక ప్రచురించిన అసత్య కథనంపై పరువునష్టం దావా కేసులో భాగంగా మంత్రి నారా లోకేశ్ నేడు విశాఖ కోర్టుకు హాజరయ్యారు. మూడోసారి క్రాస్ ఎగ్జామినేషన్‌కు ఉదయం 11 గంటలకు కోర్టుకు రాగా.. మధ్యాహ్నం 3 గంటల వరకు కేసుకు సంబంధించి వాదనలు జరిగాయి. చివరకు న్యాయమూర్తి ఈనెల 21కి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.

News January 7, 2026

కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సందర్భంగా ఎక్కడైనా కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ లక్ష్మీశ హెచ్చరించారు. గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు చట్టాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, సంయుక్త బృందాలతో తనిఖీలు చేపట్టి కోడి పందేలు జరగకుండా చూడాలని ఆయన ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో గోడ పత్రికలు విడుదల చేశారు.

News January 7, 2026

WNP: ఈనెల 21న దివ్యాంగులకు ప్రత్యేక ప్రజావాణి

image

దివ్యాంగుల సమస్యలు పరిష్కరించేందుకు ఈనెల 21న ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దివ్యాంగులు అధైర్య పడవద్దని లక్ష్య సాధనలో సకలాంగులతో ఎందులోనూ తక్కువ కాదని ఆయన పేర్కొన్నారు.