News February 20, 2025

తిరుపతి: హైవేపై ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

image

తిరుపతి రూరల్ మండలం, రామంజపల్లి చెక్‌పోస్ట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని ఇద్దరు స్కూటీపై వెళ్తుండగా ఆర్‌సీ పురం జంక్షన్ నుంచి ఉప్పరపల్లి వైపు వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకుపై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 7, 2026

9 నుంచి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు

image

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో 9, 10 తేదీల్లో చిత్తూరు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులను అప్రమత్తం చేసింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

News January 6, 2026

చిత్తూరు: యూరియా వాడకంతో పాలు తగ్గుతాయి..!

image

ఐరాల మండలం చిన్నకంపల్లిలో జిల్లా వ్యవసాయ అధికారి మురళి ఆధ్వర్యంలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎక్కువ యూరియా వాడటంతో కలిగే నష్టాలను రైతులకు వివరించారు. తగిన మోతాదులో యూరియా వాడితేనే పంట దిగుబడి పెరుగి.. చీడ పీడలు తగ్గుతాయని చెప్పారు. వెటర్నరీ డాక్టర్ మాట్లాడుతూ.. పశుగ్రాసానికి యూరియా వాడకంతో పాలు, వెన్న శాతం తగ్గుతాయని తెలిపారు.

News January 6, 2026

చిత్తూరు జిల్లాలో తగ్గిన పంచాయతీలు

image

పునర్విభజన కారణంగా చిత్తూరు జిల్లాలో పంచాయతీల సంఖ్య భారీగా తగ్గిపోయింది. 696 పంచాయతీలున్న జిల్లాలో తాజాగా ఆ సంఖ్య 621కి తగ్గింది.75 గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాకు వెళ్లాయి. పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు, చౌడేపల్లె, సదుం మండలాలను మదనపల్లె జిల్లాలో కలపడంతో 32గా ఉన్న మండలాల సంఖ్య 28కి తగ్గింది.