News February 8, 2025
తిరుపతి: హోటల్ గ్రాండ్ రిడ్జ్‌కు బాంబు బెదిరింపులు

తిరుపతిలోని హోటల్ గ్రాండ్ రిడ్జ్‌కు శనివారం బాంబు బెదిరింపు మెయిల్ వచ్చినట్లు యాజమాన్యం తెలిపింది. ‘అచ్చి ముత్తు సవుక్కు శంకర్’ అనే పేరుతో వచ్చిన మెయిల్ చూసిన మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాంబ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 6, 2025
ముగ్గురు కూతుళ్లు మృతి.. పరిహారం అందజేత

TG: బస్సు ప్రమాదంలో మరణించిన <<18204239>>ముగ్గురు<<>> అమ్మాయిల (తనూష, సాయి ప్రియ, నందిని) తండ్రి ఎల్లయ్యను MLA మనోహర్ రెడ్డి పరామర్శించారు. రూ.7 లక్షల చొప్పున రూ.21 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ఈ క్రమంలో తండ్రి తన కూతుళ్లను గుర్తు చేసుకుంటూ రోదించారు. ‘నా రెండో కూతురు ఉద్యోగం చేస్తూ నెలకు రూ.60వేలు సంపాదించేది. ఇప్పుడు ముగ్గురు కూతుళ్లు నాకు పంపిన జీతమా ఇది?’ అంటూ గుండెలు బాదుకున్నారు.
News November 6, 2025
నేడు కేయూలో మౌన దీక్ష

బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌తో రాష్ట్ర బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 6న రాష్ట్రవ్యాప్తంగా అష్టాంగ ఆందోళనల్లో భాగంగా మౌన దీక్షలు చేపట్టనున్నారు. కాకతీయ యూనివర్సిటీ SDLCE వద్ద ఉన్న మహాత్మ జ్యోతిబాఫూలే, సావిత్రిబాయి విగ్రహాల వద్ద ఉదయం 10.30 గంటలకు నల్ల రిబ్బన్‌లతో మౌన దీక్ష నిర్వహించనున్నారు.
News November 6, 2025
ఓ వైపు చిరుతలు, మరో వైపు ఏనుగులు.. పవన్ దారెటు.!

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తరచూ <<18213730>>చిరుతలు<<>>, ఏనుగుల భయం ప్రజలను వెంటాడుతోంది. అటవీ సమీప ప్రాంతాల్లో చిరుతలు బయటకు వచ్చి పశువులపై దాడి చేస్తున్న ఘటనలు అధికం అవుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో <<18203282>>ఏనుగులు<<>> తిష్టవేసి పంట పొలాలను ధ్వంసం చేస్తూ ప్రాణ నష్టమూ కలిగిస్తున్నాయి. మరో రెండు రోజుల్లో అటవీ శాఖ మంత్రి పవన్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.


