News February 8, 2025
తిరుపతి: హోటల్ గ్రాండ్ రిడ్జ్‌కు బాంబు బెదిరింపులు

తిరుపతిలోని హోటల్ గ్రాండ్ రిడ్జ్‌కు శనివారం బాంబు బెదిరింపు మెయిల్ వచ్చినట్లు యాజమాన్యం తెలిపింది. ‘అచ్చి ముత్తు సవుక్కు శంకర్’ అనే పేరుతో వచ్చిన మెయిల్ చూసిన మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాంబ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 28, 2025
MDCL: మిషన్ భగీరథ ఇంజనీర్లకు మంత్రి ఆదేశాలు

HYDలో MDCL,RR సహా ఇతర జిల్లాల మిషన్ భగీరథ CE, SE, DE ఇంజనీర్లతో మంత్రి సీతక్క సమావేశమై పలు సూచనలు చేశారు. ✓ఇంజినీర్లు వారంలో 4 రోజులు క్షేత్రస్థాయిలో ఉండాలి✓మండల స్థాయిలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు✓పండుగల సమయంలో తాగునీటి సమస్యలు రాకుండా ప్రత్యేక చర్యలు✓అభివృద్ధి పనుల వల్ల పైపుల డ్యామేజ్ కాకుండా జిల్లా కలెక్టర్లతో సమన్వయం✓ కొత్త బోర్ల వైపు కాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలి.
News March 28, 2025
ఇఫ్తార్ విందులో ఆనం, అజీజ్, కోటంరెడ్డి

రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కస్తూరిదేవి గార్డెన్స్‌లో శుక్రవారం రాత్రి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం, వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అజీజ్, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి, కలెక్టర్ ఆనంద్, కమిషనర్ తోపాటు ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు. వారు ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు.
News March 28, 2025
అనకాపల్లి: వచ్చే నెల 1న సాంఘిక శాస్త్రం పరీక్ష

పదో తరగతి విద్యార్థులకు సాంఘిక శాస్త్రం పరీక్ష ఏప్రిల్ 1వ తేదీన నిర్వహించనున్నట్లు అనకాపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 31వ తేదీన రంజాన్ పండగ సందర్భాన్ని పురస్కరించుకుని పరీక్షను 1వ తేదీకి వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు ఈ మార్పును గమనించాలని కోరారు.