News August 6, 2024
తిరుపతి: 108లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
108లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఏఈఎంఎస్ శ్రీనివాసులు తెలిపారు. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ) ఉద్యోగాలకు బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం, బీఎస్సీ లైఫ్ సైన్స్, బీఎస్సీ ఎంఎలీ, బి.ఫార్మసీ, డీఎంఎల్ పూర్తి చేసి ఉండాలని, పైలట్ కి పదో తరగతి, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్నారు. వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
Similar News
News September 12, 2024
భాకరాపేట ప్రమాదం మృతుల వివరాల గుర్తింపు
భాకరాపేట ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కర్ణాటక రాష్ట్రం చిక్బల్లాపూర్‌కు చెందిన రమేశ్ మూర్తి(34), మంజునాథ(38), ముని వెంకట్ రెడ్డి(55), మరి కొందరు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. కారులో తిరిగి వెళ్తుండగా ఘాట్ రోడ్డులో కంటైనర్ ఢీకొని ముగ్గురు మృతిచెందారు. కారులో ప్రయాణిస్తున్న తేజస్ కుమార్(33), తమిళనాడుకు చెందిన కంటైనర్ డ్రైవర్ అల్లావుద్దీన్(30) తీవ్రంగా గాయపడ్డారు.
News September 12, 2024
CTR: వినాయకుడికి ముస్లిం సోదరుల పూజలు
చిత్తూరు జిల్లాలో ముస్లిం సోదరులు వినాయకుడికి పూజలు నిర్వహించి వారెవ్వా అనిపించారు. పులిచెర్ల మండలం కె.కొత్తకోటకు చెందిన ముస్లిం సోదరులు షేక్ ఫిరోజ్ బాషా, షేక్ చాంద్ బాషా గ్రామంలో వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు. స్థానికంగా ఏడు దేవతామూర్తులు ఉన్న గుడిలో గణనాథుడికి పూజలు నిర్వహించారు. ఇలా మతసామరస్యం చాటిన ఆ సోదరులను అందరూ అభినందిస్తున్నారు.
News September 12, 2024
చిత్తూరు జిల్లా నేతలతో జగన్ సమాలోచనలు
ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ నేతలు ఇవాళ తాడేపల్లిలో మాజీ సీఎం జగన్‌ను కలిశారు. మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, రోజా, నారాయణ స్వామి, ఎంపీ మిథున్ రెడ్డి తదితరులు జిల్లాలోని పరిస్థితులను మాజీ సీఎంకు వివరించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై గట్టిగా పోరాడాలని జగన్ సూచించారు. ఎమ్మెల్సీలు భరత్, సిపాయి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు.