News March 11, 2025
తిరుపతి: 25న స్పాట్ అడ్మిషన్లు

తిరుపతి శ్రీపద్మావతి మహిళ విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ (CDOE) దూరవిద్యా విభాగంలో ఈ 25వ తేదీన స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. M.Com, M.A తెలుగు, M.A మ్యూజిక్, వివిధ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలకు www.spmvv.ac.in చూడాలి.
Similar News
News March 20, 2025
ఉప్పల్ స్టేడియానికి రాజీవ్ గాంధీ పేరు ఎందుకు? : కామెంటేటర్

ఉప్పల్ స్టేడియానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టడంతో పాటు అక్కడ ఆయన విగ్రహం ఏర్పాటు చేయడంపై క్రికెట్ కామెంటేటర్ వెంకటేశ్ ప్రశ్నించారు. ‘హైదరాబాద్ క్రికెట్‌కు రాజీవ్ గాంధీకి ఏమిటి సంబంధం? HYD క్రికెట్‌కు వన్నె తెచ్చిన అబిద్ అలీ, ML జయసింహ లాంటి వారి విగ్రహాలు పెడితే బాగుండేది’ అని డిమాండ్ చేశారు. అరుణ్ జైట్లీ, నరేంద్ర మోదీ స్టేడియంలపై నెటిజన్లు ప్రశ్నించగా వాటిని కూడా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.
News March 20, 2025
మెదక్: పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

మెదక్ జిల్లా వ్యాప్తంగా రేపటి నుంచి పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. నేడు హవేలి ఘనపూర్‌లోని సర్దన జిల్లా పరిషత్ హైస్కూల్‌ను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్షకు హాజరై ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ సూచించారు.
News March 20, 2025
KMR: పీజీ మొదటి సెమిస్టర్ ఫలితాల విడుదల

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫిబ్రవరి నెలలో జరిగిన పీజీ ప్రథమ సంవత్సర(రెగ్యులర్) ఫలితాలను తెలంగాణ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రో.సంపత్ కుమార్, కళాశాల ప్రిన్సిపల్ కె. విజయ్ కుమార్ విడుదల చేశారు. ఈ పరీక్షలలో 75 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని కళాశాల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డా.కిష్టయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో TU అడిషనల్ కంట్రోలర్ సంపత్ అధికారులు ఉన్నారు.