News May 25, 2024
తిరుపతి: 27న క్యాంపస్ డ్రైవ్

పద్మావతిపురంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో 27న క్యాంపస్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీ లక్ష్మీ ప్రకటించారు. ఐటీఐ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA) ట్రేడ్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టెక్ మహీంద్రా కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News November 17, 2025
చిత్తూరు పోలీసులకు అందిన 38 ఫిర్యాదులు

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 38 ఫిర్యాదులు అందినట్టు అధికారులు తెలిపారు. వీటిని చట్టప్రకారం విచారించి బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఎస్పీ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు పాల్గొన్నారు.

చిత్తూరు కలెక్టరేట్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

చిత్తూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. కార్యాలయాల చుట్టూ తిరిగిన తన భూ సమస్యకు పరిష్కారం దొరకలేదంటూ వి.కోట(M) మిట్టూరుకు చెందిన నందిని పురుగుల మందు తాగింది. అక్కడున్న మహిళా పోలీసులు వెంటనే స్పందించారు. ఆమెను ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.