News August 27, 2024
తిరుపతి: 30న జాబ్‌మేళా
ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో 30వ తేదీ ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కార్యాలయ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. 3 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. పదో తరగతి, ఇంటర్, ఏదేని డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. మొత్తం 215 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News December 12, 2024
శ్రీవారి పాదాల మార్గం మూత
తిరుమలలో భారీ వర్షాల కురుస్తోన్న నేపథ్యంలో TTD అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలోని పాపవినాశనం, ఆకాశగంగ, జపాలి, వేణుగోపాల స్వామి వారి ఆలయం మార్గంతో పాటు శ్రీవారి పాదాల మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టాక వాటిని తిరిగి తెరుస్తామని అధికారులు తెలిపారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
News December 12, 2024
తిరుపతి జిల్లాలోనూ సెలవు
భారీ వర్షాల కారణంగా తిరుపతి జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శుభం బన్సల్ నేడు సెలవు ప్రకటించారు. ఎవరైనా పాఠశాలలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. అన్నమయ్య జిల్లా(మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె)లో సెలవుపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.
News December 12, 2024
పాఠశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు: చిత్తూరు JC
భారీ వర్షాల కారణంగా చిత్తూరు జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి ఇవాళ సెలవు ప్రకటించించన విషయం తెలిసిందే. ఎవరైనా పాఠశాలలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఎవరూ ఈ నిబంధనను అతిక్రమించరాదన్నారు. అన్నమయ్య జిల్లాలో సెలవుపై ఎలాంటి ప్రకటన రాలేదు.