News February 11, 2025

తిరుపతి: 41.5 కేజీల గంజాయి స్వాధీనం

image

తిరుపతి జిల్లా పోలీసు శాఖ ఫిబ్రవరి మొదటి వారపు గణాంకాలను ఎస్పీ హర్షవర్ధన్ రాజు కార్యాలయం తెలిపింది. గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తూ సుమారు 41.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బహిరంగంగా మద్యం సేవించే వారిపై 913 కేసులను నమోదు చేసి, 913 మందికి కోర్టులో జరిమానాలు విధించినట్లు చెప్పారు.

Similar News

News February 24, 2026

థాయ్‌లాండ్‌లో కొత్త వైరస్.. జూపార్క్‌లో ‘బయో- బబుల్’

image

‘థాయ్‌లాండ్ మరణాలు ఒక హెచ్చరిక.. గాలి ద్వారా వైరస్ సోకకుండా అడ్డుకోవం మా లక్ష్యం’ అని నెహ్రూ జూపార్క్ సిబ్బంది తెలిపారు. శానిటైజేషన్‌కే పరిమితం కాకుండా, వన్యప్రాణుల మధ్య ‘సోషల్ డిస్టెన్సింగ్’ ఎన్‌క్లోజర్ల పర్యవేక్షణను పెంచారు. వైరస్ మ్యుటేషన్ చెందకుండా సోడియం హైపో క్లోరైడ్, జంతువుల ఆహారంలో రోగనిరోధక శక్తిని పెంచే సప్లిమెంట్లను ఇస్తున్నారు. మూగజీవాల ప్రాణాలను కాపాడేందుకు యుద్ధం అని వివరించారు.

News February 24, 2026

పార్వతీపురం: ‘డోలి రహిత రోడ్ల నిర్మాణంలో నాణ్యత, పారదర్శకత పాటించాలి’

image

జిల్లాలో చేపట్టిన డోలి రహిత రోడ్ల నిర్మాణంలో నాణ్యత, పారదర్శకతతో పనులను పూర్తిచేయాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మొత్తం మంజూరు చేసిన 81 డోలి రోడ్ల పనులు కూడా జరగాలని, ప్రారంభం కాని రోడ్లు ఉంటే వెంటనే ప్రారంభించాలన్నారు. ఇప్పటివరకు 50 రోడ్ల పనులు గ్రౌండింగ్ అయ్యాయని, మిగిలిన పనులన్నీ ప్రారంభం కావాలన్నారు.

News February 24, 2026

కష్టాల్లో భారత్.. 5 వికెట్లు డౌన్

image

ఆస్ట్రేలియా ఉమెన్స్ జట్టుతో జరుగుతున్న తొలి వన్డేలో భారత అమ్మాయిలు తడబడుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియా 103 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ప్రతీకా రావల్ డకౌట్ కాగా షెఫాలీ 4, రోడ్రిగ్స్ 8, దీప్తి 2 రన్స్‌కే ఔట్ అయ్యారు. స్మృతి మంధాన మాత్రమే 58 పరుగులతో రాణించారు. కెప్టెన్ హర్మన్(26), రిచా(10) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 28 ఓవర్లకు 122/5.