News February 4, 2025

తిరుపతి: 5 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్

image

తిరుపతి జిల్లాలో ఫిబ్రవరి 5 నుంచి 20వ తేదీ వరకు జరిగే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. జిల్లాలో ఇంటర్ జనరల్ విద్యార్థులు 24927 మంది ఉండగా 124 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఒకేషనల్ అభ్యర్థులు 2355 మంది 23 పరీక్ష కేంద్రాల్లో ప్రాక్టికల్స్ జరుగుతుందన్నారు. విద్యార్థులు ఉదయం 8.45 గంటలకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

Similar News

News December 4, 2025

కోరుకొండలో గంజాయి ముఠా గుట్టురట్టు

image

గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాను కోరుకొండ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. సీఐ సత్యకిషోర్ తెలిపిన వివరాల ప్రకారం.. నరసాపురం-కనుపూరు రోడ్డులో గంజాయి చేతులు మారుతుండగా దాడి చేసి 18 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అల్లూరి జిల్లా దారకొండ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా పట్టుబడిన ఆరుగురిని అరెస్టు చేశారు. స్విఫ్ట్ కారు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.

News December 4, 2025

జిల్లాలో తొలివిడతలో ఏకగ్రీవమైన పంచాయతీలు

image

జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 9 గ్రామపంచాయతీలు పూర్తిగా ఏకగ్రీవం అయ్యాయి. రుద్రంగి మండలంలో పది పంచాయతీలకు గాను ఏడు పంచాయతీలలో సర్పంచు, వార్డు స్థానాలు పూర్తిగా ఏకగ్రీవం కాగా, కోనరావుపేట మండలంలో 28 పంచాయతీలకు గాను రెండు పంచాయతీలు ఏకగ్రీవం అయినట్లు అధికారులు తెలిపారు. చందుర్తి, వేములవాడ, వేములవాడ రూరల్ మండలంలో ఒక పంచాయతీ కూడా ఏకగ్రీవం కాలేదు.