News August 3, 2024
తిరుపతి : B.Tech డైరీ టెక్నాలజీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు

శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ నందు 2024-25 విద్యా సంవత్సరానికి B.Tech డైరీ టెక్నాలజీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ చంగల్ రాయులు ప్రకటనలో పేర్కొన్నారు. AP EAPCET-2024 ప్రవేశపరీక్ష పాసైన అభ్యర్థులు అర్హులన్నారు. ఇతర వివరాలకు https://www.svvu.edu.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 12.
Similar News
News December 6, 2025
హోంగార్డుల సంక్షేమానికి కృషి: చిత్తూరు SP

హోంగార్డుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిసారించినట్లు చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. 63వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొని కవాతు ప్రదర్శనను వీక్షించారు. చిత్తూరు జిల్లాలో శాంతిభద్రతల కోసం 357 మంది హోంగార్డ్స్ విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. వీరి సేవలు ప్రశంసనీయమన్నారు. నేరాలను అరికట్టడంలో పోలీసులకు వెన్నుదన్నుగా ఉంటున్నారని కొనియాడారు.
News December 6, 2025
చిత్తూరు: అంగన్వాడీలకు నిధులు మంజూరు.!

చిత్తూరు జిల్లాలో అంగన్వాడీల మౌలిక వసతులకు రూ.8 కోట్లను మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసీడీఎస్ శాఖ ద్వారా అమలుచేస్తున్న సంక్షేమ ఫలాలను పేదలకు అందజేయాలని సూచించారు. దీనిపై కలెక్టర్ కార్యాలయంలో నాగార్జున ఐఏఎస్ వీసీలో ఐసీడీఎస్ అధికారులతో శుక్రవారం సమీక్షించారు. అసంపూర్ణంగా ఉన్న అంగన్వాడీ భవనాల నిర్మాణం, తాగునీరు, వసతులు ఏర్పాటు చేస్తామన్నారు.