News March 1, 2025
తిరుపతి: CC కెమెరాల నిఘాలో ఇంటర్ పరీక్షలు

ఇంటర్ పరీక్షలకు తిరుపతి జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 86 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాగా ఇంటర్ ప్రథమ సం.లో 32,213 మంది, ద్వితీయ సం.లో 30,548 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. కోట(M) అంబేడ్కర్ గురుకులం సెంటర్లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఎస్ వెంకటేశ్వర్లు తెలిపారు.
Similar News
News September 15, 2025
సిరిసిల్ల కలెక్టరేట్లో వృద్ధుడి ఆత్మహత్యాయత్నం

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలానికి చెందిన అజ్మీరా విఠల్ సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో కొడుకు, కోడలు తనను పోషించకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తూ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వెంటనే అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగానే ఉందని పోలీసులు తెలిపారు.
News September 15, 2025
సిరాజ్కు ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు

భారత స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్కు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ (ఆగస్టు) అవార్డు దక్కింది. ఇటీవల ఇంగ్లండ్తో చివరి టెస్టులో సిరాజ్ అద్భుతమైన స్పెల్ వేశారు. 9 వికెట్లు తీసి సిరీస్ 2-2తో సమం కావడంలో కీలకపాత్ర పోషించారు. ఆ సిరీస్లో ప్రతి మ్యాచ్ ఆడిన సిరాజ్.. మొత్తం 23 వికెట్లు పడగొట్టారు.
News September 15, 2025
సమయపాలన, క్రమశిక్షణ పాటించాలి: ఎస్పీ వకుల్

పోలీస్ సిబ్బందిలో క్రమశిక్షణ, సమయపాలన, జవాబుదారీతనం పెంపొందించేందుకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో రోల్ కాల్ నిర్వహించాలని ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. సోమవారం ఆయన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది. ప్రతి పోలీస్ సిబ్బంది చక్కని యూనిఫామ్ ధరించి, సమయపాలన పాటించాలని, ఫిర్యాదు దారులతో మర్యాదపూర్వకంగా మెలగాలని ఎస్పీ సూచించారు.