News July 15, 2024

తిరుపతి: IIDTలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

రేణిగుంట ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్(IIDT)లో 2024-25 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. AI/ML సైబర్ సెక్యూరిటీ/ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అర్హత, ఇతర వివరాలకు iidt.ap.gov.in వెబ్‌సైట్ చూడాలి. దరఖాస్తులకు చివరి తేదీ జూలై 31.

Similar News

News November 2, 2025

పుత్తూరు: ‘ప్రభుత్వ వైఫల్యం వల్లే తొక్కిసలాట’

image

కూటమి ప్రభుత్వం వైఫల్యం వల్లే తొక్కిసలాట జరిగి అమాయకులు ప్రాణాలు కోల్పోయారని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. పుత్తూరులో ఆయన శనివారం మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ వేంకటేశ్వర ఆలయం వద్ద 9 మంది తొక్కిసాలాటలో మరణించడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో రోజురోజుకి సామాన్య ప్రజలకు, భక్తులకు భద్రత లేకుండా పోతుందన్నారు. కూటమి ప్రభుత్వంలో అమాయక ప్రజలే ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపించారు.

News November 1, 2025

కుప్పం: మెడికో ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమా..?

image

కుప్పం మెడికల్ కళాశాలలో పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న హర్షవర్ధన్ (24) మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. పీజీ అనస్తీషియా చేస్తున్న హర్షవర్ధన్ ఉదయం ఆసుపత్రిలో ఓ సర్జరీ కేసు చూసుకుని మధ్యాహ్నం లంచ్ సమయంలో హాస్టల్ గదిలోకి వెళ్లి హై డోస్ ఇంజక్షన్ వేసుకోవడంతో కార్డియాక్ అరెస్టై మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుడు నంద్యాల జిల్లా డోన్ కు చెందిన నాగరాజు కుమారుడు హర్షవర్ధన్‌గా సమాచారం.

News November 1, 2025

పరకామణి కేసులో నిందితుడు, ప్రతివాదులకు నోటీసులు…!

image

పరకామణి కేసులో ప్రధాన నిందితుడైన సీవీ రవి కుమార్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు ప్రతివాదులైన అప్పటి ఏవీఎస్వో సతీశ్ కుమార్, ఎండోమెంట్ చీఫ్ సెక్రటరీ, ఏపీ లీగల్ సర్వీస్ సెక్రటరీ, సీఐడీ డీజీ, టీటీడీ ఈవో, సీవీఎస్వో, తిరుమల – 1 టౌన్ సీఐలతో పాటు మరి కొందరికి నోటీసులు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని అందులో పేర్కొంది.