News March 16, 2025
తిరుపతి: JRFకు దరఖాస్తులు ఆహ్వానం

తిరుపతి IITలో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. M.S/ఎంటెక్ ఇన్ ECE/ EEE/ CSE/ IT/ AI, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని తెలియజేశారు. ఇతర వివరాలకు https://www.iittp.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 28.
Similar News
News April 20, 2025
మనుబోలు: పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు

మనుబోలు మండలంలోని వడ్లపూడి వద్ద ఆదివారం కారు బోల్తా పడి అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో కారులో ఐదుమంది ఉన్నారు. వీళ్లంతా సురక్షితంగా బయటపడ్డారు. పొదలకూరు మండలం బిరదవోలు రాజుపాలెంకు చెందిన వారు కొత్త కారును కొనుగోలు చేసి గొలగమూడిలో పూజలు చేయించుకొని తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
News April 20, 2025
కృష్ణా: LLB పరీక్షల ఫలితాలు విడుదల

కృష్ణా యూనివర్శిటీ పరిధిలో ఇటీవల నిర్వహించిన LLB 3వ, 7వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని KRU పరీక్షల విభాగం సూచించింది.
News April 20, 2025
కాబోయే భార్య వేధింపులు.. అధికారి సూసైడ్

కాబోయే భార్య వేధింపులు తాళలేక ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సూసైడ్ చేసుకున్న ఘటన MHలో జరిగింది. నాసిక్‌కు చెందిన హరేరామ్(36), వారణాసి యువతి మోహినికి ఎంగేజ్‌మెంట్ జరిగింది. మోహిని తన లవర్‌ను హగ్ చేసుకోవడం చూసి హరేరామ్ నిలదీశాడు. విషయం బయటకు చెబితే తనతో పాటు కుటుంబంపై వరకట్న వేధింపుల కేసు పెడతానని ఆమె బెదిరించింది. మానసిక ఒత్తిడికి లోనైన హరేరామ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువతి, ఆమె లవర్‌పై కేసు నమోదైంది.