News April 5, 2024

తిరుపతి : LLB ఫలితాలు విడుదల

image

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో గతేడాది నవంబర్ నెలలో ఎల్ఎల్‌‌బి (LLB) రెండో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఫలితాలు శుక్రవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in, www.schools9.com ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

Similar News

News January 9, 2026

కుప్పం: పగటిపూటే వ్యవసాయ కరెంట్.!

image

కుప్పం డివిజన్‌లోని 26 సబ్‌స్టేషన్ల పరిధిలో 141 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు కానుంది. ఇందు కోసం 570 ఎకరాలకుగాను 542.16 ఎకరాల భూ సేకరణ పూర్తైంది. వీటి ద్వారా 130 ఫీడర్లకు అనుసంధానమైన 32,106 వ్యవసాయ పంపుసెట్లకు పగటిపూట అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందనుంది.

News January 9, 2026

చిత్తూరులో గణతంత్ర వేడుకలపై సమీక్ష

image

గణతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని డీఆర్ఓ మోహన్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం చిత్తూరు కలెక్టరేట్‌లోని డీఆర్ఓ కార్యాలయంలో జనవరి 26వ తేదీన నిర్వహించనున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై ఆయా శాఖల జిల్లా అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఈ వేడుకలను పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఉదయం 7 గం.లకు ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఇన్‌ఛార్జ్‌గా చిత్తూరు ఆర్డీవో ఉంటారన్నారు.

News January 9, 2026

చిత్తూరు : రేపటి నుంచి సంక్రాంతి సెలవులు

image

చిత్తూరు జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు శనివారం నుంచి ఈనెల 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులను ఇస్తున్నట్లు DEO రాజేంద్రప్రసాద్ తెలిపారు. పాఠశాల పని దినాలు సర్దుబాటులో భాగంగా 10న రెండో శనివారం పాఠశాలలు పనిచేయాల్సి ఉన్నా, సెలవు దినంగా ప్రకటించామన్నారు. ఈ దినాన్ని మరో రోజున పనిదినంగా పరిగణించాల్సి ఉందని పేర్కొన్నారు. కాగా, టెన్త్ విద్యార్థులకు వంద రోజుల ప్రత్యేక తరగతులకు సైతం బ్రేక్ ఇచ్చారు.