News June 4, 2024

తిరుపతి MP సీటు వైసీపీదే

image

తిరుపతి పార్లమెంట్ కౌంటింగ్ హోరాహోరీగా జరిగింది. తొలుత వైసీపీ అభ్యర్థి మద్దెల గురుమూర్తి వెనుకబడ్డారు. తర్వాత ప్రతి రౌండ్‌లోనూ బీజేపీ వరప్రసాద్ వరప్రసాద్‌తో హోరాహోరీ తలపడ్డారు. చివరకు గురుమూర్తికి 6,32,228 ఓట్లు దక్కాయి. సమీప ప్రత్యర్థి వరప్రసాద్ రావు 6,17,659 ఓట్లు సాధించారు. ఈక్రమంలో గురుమూర్తి 14,569 ఓట్లతో గట్టెక్కారు. ఉప ఎన్నికలో ఆయన 2,30,572 ఓట్లతో గెలవడం విశేషం.

Similar News

News December 7, 2025

చిత్తూరు జిల్లాలో నేటి చికెన్ ధరలు

image

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.152 నుంచి రూ.168, మాంసం రూ.220 నుంచి 257 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.251 నుంచి రూ.280 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు10 కోడిగుడ్ల ధర రూ. 90 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News December 7, 2025

సదుంలో సినిమా షూటింగ్

image

సదుం మండలంలోని తాటిగుంటపాలెంలో ‘నాన్న డైరీ’ సినిమా షూటింగ్ మూడు రోజులుగా జరుగుతోంది. క్లైమాక్స్ సంబంధించిన పలు దృశ్యాలను చిత్రీకరిస్తున్నట్లు డైరెక్టర్ సురేశ్, నిర్మాత కోటి తెలిపారు. మరో మూడు రోజుల పాటు షూటింగ్ కొనసాగితే చిత్రీకరణ పూర్తి అవుతుందని వారు చెప్పారు. చిత్రంలో పీలేరుకు చెందిన ఖాదర్ బాషా, షాను, సన, సదుంకు చెందిన రచయిత, కళాకారుడు రామయ్య నటిస్తున్నట్లు వెల్లడించారు.

News December 6, 2025

కామాలూరు-చిత్తూరు RTC బస్సు సర్వీసు ప్రారంభం

image

తవణంపల్లి మండలంలోని కామాలూరు-చిత్తూరు ఆర్టీసీ బస్సు సర్వీసును ఎమ్మెల్యే మురళీమోహన్ శనివారం ప్రారంభించారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు ఇటీవల పలువురు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే బస్సు సౌకర్యం కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు బస్సు సర్వీసు ప్రారంభించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.